Begin typing your search above and press return to search.

కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ స్టెప్ ఇది..!

కొన్నిసార్లు భిన్నమైన కథల కారణంగా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అయినా, తన ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు. అయితే, ప్రస్తుతం ఆయన తన కెరీర్ లో సరైన మూవ్ ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   29 Aug 2023 2:09 PM GMT
కళ్యాణ్ రామ్  కెరీర్ బెస్ట్ స్టెప్ ఇది..!
X

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నిత్యం విభిన్న కథలను ఎంచుకుంటూ సత్తా చాటుతూ ఉంటాడు. అందరిలా కాకుండా, సినిమా సినిమాకీ ఏదో ఒక వేరియేషన్ ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్త దనం ప్రయత్నిస్తూనే ఉన్నాడు. గతేడాది ఆయన బింబిసార మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన అమిగోస్ తో భిన్నంగా ప్రయత్నించాడు కానీ, పెద్దగా వర్కౌట్ కాలేదు.

ఫలితం తో సంబంధం లేకుండా, ఆయన విభిన్నమైన కథలను మాత్రమే ఎంచుకుంటూ ఉంటాడు. ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు కొత్తదనాన్ని పరిచయం చేయాలనే అనుకుంటూ ఉంటాడు. కొన్నిసార్లు భిన్నమైన కథల కారణంగా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. అయినా, తన ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదు. అయితే, ప్రస్తుతం ఆయన తన కెరీర్ లో సరైన మూవ్ ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

బింబిసార సినిమాతో ఎవరూ ట్రై చేయని యాంగిల్ ని ఆయన ప్రయత్నించారు. ఇప్పుడు దానికి సీక్వెన్స్ కూడా తీస్తున్నారు. ఇది కాకుండా, ఆయన డెవిల్ అనే మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా డెవిల్ మూవీ టీజర్ విడుదల చేశారు. ఇప్పుడు ఈ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ఆద్యంతం గూస్ బంప్స్ ను తెప్పిస్తుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం రాక ముందు బ్రిటీష్ వారి హయాంలో వాళ్ల ఏజెంట్ గా పని చేసిన ఓ వ్యక్తి కథే ఈ డెవిల్.

ఈ సినిమా కథ భిన్నంగా సాగుతుందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన వచ్చే సినిమాలన్నీ డిఫరెంట్ జోనర్లో సాగుతున్నాయని తెలుస్తోంది. ఒకే జోనర్ కి స్టిక్ అవ్వకుండా, డిఫరెంట్ జోనర్లు ప్రయత్నిస్తూ, తన కెరీర్ ని అద్భుతంగా మలుచుకుంటున్నారు. కరెక్ట్ టైమ్ లో కరెక్ట్ పాత్ ని ఎంచుకుంటూ ఆయన తన కెరీర్ ని మలుచుకుంటున్న విధానం అందరికీ నచ్చుతుంది.

ప్రేక్షకులకు ఎప్పుడూ కొత్త దనం అందించాలనే ఆయన ప్రయత్నాన్ని చూసే వారు కూడా ఆదరిస్తే, ఆయనకు విజయాలు కూడా దక్కుతాయి. విజయాలు దక్కినప్పుడే, కొత్తగా ఏదైనా చేయాలనే ఉత్సాహం కూడా పెరుగుతుంది. మరి, ఆయన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ ఎంత వరకు విజయం సాధిస్తాయో, ప్రేక్షకులు ఎంత మేర ఆదరిస్తారో చూడాలి.