Begin typing your search above and press return to search.

'కళ్యాణి వచ్చా వచ్చా' సాంగ్.. ఎలా ఉందంటే..

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈసారి ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఫ్యామిలీ స్టాల్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు

By:  Tupaki Desk   |   12 March 2024 2:11 PM GMT
కళ్యాణి వచ్చా వచ్చా సాంగ్.. ఎలా ఉందంటే..
X

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఈసారి ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఫ్యామిలీ స్టాల్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు. ఈ సినిమాలో యువతను ఆకట్టుకునే మాస్ ఎలిమెంట్స్ కూడా ఉన్నట్లు ఫస్ట్ లుక్ టీజర్ తోనే క్లారిటీ ఇచ్చేశారు. ఇక సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ హడావిడి కూడా మొదలైంది. ఏప్రిల్ 5వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతున్న ఈ సినిమాను పరుశురామ్ డైరెక్ట్ చేస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు.

ఇక సినిమా విడుదలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో సాంగ్స్ తో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక సినిమా మొదటి పాట ఇప్పటికే ఆకట్టుకోగా ఇప్పుడు రెండో సాంగ్ విడుదల చేశారు. "కళ్యాణి వచ్చావచ్చా" అనే ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సాంగ్ చాలా కలర్ఫుల్ గా హైలైట్ అవుతోంది.

లిరికల్ వీడియోలో విజయ్ దేవరకొండ హీరోయిన్ మృణాల్ ఠాగూర్ ఇద్దరు కూడా అదిరిపోయే స్టూప్పులతో ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా గోపి సుందర్ అద్భుతమైన కంపోజింగ్ తో పాటకు మరింత అందాన్ని తీసుకువచ్చారు. చూస్తూ ఉంటే ఈ పాట సినిమా మొత్తంలో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఉందని అర్థమవుతోంది.

విజయ్ మృణాల్ మధ్యలో కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. ఒక పాట తోనే సినిమాలో సరికొత్త సెలబ్రేషన్స్ కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి గానే కనిపించబోతున్నట్లు ఇటీవల టీజర్ లో తెలియజేశారు. పెట్రోల్ బంక్ లో అతను చుక్క పెట్రోల్ విడవకుండా పైపుని కదిపే విధానం వల్ల అతని క్యారెక్టర్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది.

అయితే ఈ సాంగ్ చూస్తే మాత్రం చాలా గ్రాండియర్ గా డబ్బున్న వాళ్ళు చేసుకునే సెలబ్రేషన్ లా అనిపిస్తోంది. బహుశా మిడిల్ క్లాస్ హీరోను ఒక డబ్బున్న హీరోయిన్ పెళ్లి చేసుకుని ఉండవచ్చు అనే తరహాలో కథ ఉండవచ్చని టాక్ వస్తోంది. మరి దర్శకుడు పరుశురాం కొత్తగా ఎల్ ప్రజెంట్ చేశాడో చూడాలి. పరుశురామ్ ఫ్యామిలీ కంటెంట్ ఉన్న సినిమాలను పర్ఫెక్ట్ గా అందించడంలో సిద్ధహస్తుడు అని చెప్పవచ్చు.

విజయ్ తో అతను ఇంతకుముందు చేసిన గీతగోవిందం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ తో కూడా అదే మ్యాజిక్ వర్కౌట్ అవుతుంది అని నమ్ముతున్నారు. ఇక ఏప్రిల్ 5వ తేదీన రాబోతున్న ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగా ఉంటుందో లేదో చూడాలి.