కళ్యాణి ప్రియదర్శన్.. ది బాస్ లేడీ వైబ్స్
కళ్యాణి సోషల్ మీడియాల్లోను బిజీగా ఉంది. ఈ బబ్లీ బ్యూటీ ఇటీవల కొంత ట్రెడిషన్ కి ఆవల ట్రెండీ లుక్స్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటోంది.
By: Tupaki Desk | 22 Jun 2025 11:54 AM ISTక్యూట్ లుక్స్‌తో కుర్రకారు గుండెల్ని కొల్లగొడుతున్న ఈ బ్యూటీ ఎవరో పరిచయం చేయాలా? .. అసలు పరిచయమే అవసరం లేని పేరు- కళ్యాణి ప్రియదర్శన్. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె. బలమైన సినీనేపథ్యం నుంచి వచ్చిన కళ్యాణి బహుభాషల్లో నటిగా వెలిగిపోతోంది. ఓవైపు మలయాళం, మరోవైపు తెలుగు, తమిళంలోను నటిస్తూ బిజీగా ఉంది.
కళ్యాణి ప్రస్తుతం జెనీ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు `ఒడం కుతిర చదుం కుతిర` అనే మలయాళ చిత్రం, లోకా- చాప్టర్ 1 (చంద్ర) అనే మలయాళ సూపర్ హీరో ఫిలింలోను నటిస్తూ బిజీగా ఉంది. లోకా చాప్టర్ 1 సినిమాని దుల్కార్ సల్మాన్ సహభాగస్వామిగా నిర్మిస్తున్నారు.
కళ్యాణి సోషల్ మీడియాల్లోను బిజీగా ఉంది. ఈ బబ్లీ బ్యూటీ ఇటీవల కొంత ట్రెడిషన్ కి ఆవల ట్రెండీ లుక్స్ లో కనిపిస్తూ ఆకట్టుకుంటోంది. ఇంతకుముందే కళ్యాణి బికినీ లుక్ ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. ఇప్పుడు ట్రెడిషనల్ వైట్ టాప్, బ్రౌన్ ట్రాక్ ధరించి అదిరిపోయే ఫోజు ఇచ్చింది. ఆ భుజానికి తగిలించిన వైట్ హ్యాండ్ బ్యాగ్, బ్లాక్ గాగుల్స్, ఐఫోన్... కళ్యాణి ఇస్టయిల్ ప్రతిదీ కుర్రకారును ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.
కళ్యాణి కెరీర్ గ్రాఫ్‌ని పరిశీలిస్తే కొన్ని ఆసక్తికర చిత్రాల్లో నటించింది. ఈ భామ ప్రారంభం అసిస్టెంట్ ప్రొడక్షన్ డిజైనర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆమె తెలుగు చిత్రం హలో (2017)లో కథానాయికగా నటనా రంగ ప్రవేశం చేసింది. ఉత్తమ ఆరంగేట్ర కథానాయికగా ఫిల్మ్‌ఫేర్ సౌత్ అవార్డును గెలుచుకుంది. ఆ తర్వాత హీరో (2019)తో తమిళ సినీ రంగంలో ప్రవేశించింది. వారణే అవశ్యముండ్ (2020)తో మలయాళ సినిమాకు పరిచయమైంది. ఆ తర్వాత చిత్రలహరి (2019), మానాడు (2021), హృదయం (2022), తాళ్ళుమాళ (2022), బ్రో డాడీ (2022) చిత్రాల్లో నటించింది. వీటిలో చివరిదానికి ఆమె మలయాళంలో ఉత్తమ నటిగా సైమా అవార్డును గెలుచుకుంది. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉంది.
