Begin typing your search above and press return to search.

కిక్‌లు పంచ్‌ల‌తో ఝ‌డిపిస్తున్న న‌టి

తాజాగా సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్స్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారాయి. ఇందులో క‌ళ్యాణి బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది.

By:  Tupaki Desk   |   12 April 2025 9:11 AM IST
కిక్‌లు పంచ్‌ల‌తో ఝ‌డిపిస్తున్న న‌టి
X

క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ `హ‌లో` సినిమాలో అతిథి పాత్ర‌తో తెలుగు చిత్ర‌సీమ‌కు ప‌రిచ‌య‌మై ఆరంగేట్ర‌మే న‌టిగా మంచి పేరు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత `చిత్ర‌ల‌హారి`లో మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ స‌ర‌స‌న న‌టించిన సంగ‌తి తెలిసిందే. `ర‌ణ‌రంగం` అనే చిత్రంలోను న‌టించింది. ఇటు తెలుగు ప‌రిశ్ర‌మ‌తో ప‌టు, అటుపై కోలీవుడ్ లోనూ కొన్ని ప్ర‌య‌త్నాలు చేసింది. చివ‌రిగా మాతృభాష మ‌ల‌యాళంలోను ప‌లు చిత్రాల్లో న‌టించింది.


మాలీవుడ్ లో `హృదయం` అనే చిత్రంతో పాటు మోహ‌న్ లాల్ తో క‌లిసి `బ్రోడాడి`లోనూ న‌టించింది. `త‌ల్లు మాల` అనే మ‌రో మ‌ల‌యాళ‌ సినిమాలోనూ న‌టించింది. ఇక సోష‌ల్ మీడియాలోనూ యంగ్ బ్యూటీ యాక్టివ్ గానే ఉంది. ఇటీవ‌ల క‌ళ్యాణి వ‌రుస ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తోంది.


తాజాగా సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేసిన ఓ ఫోటోగ్రాఫ్స్ ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారాయి. ఇందులో క‌ళ్యాణి బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది. చూస్తుంటే క‌ళ్యాణి చాలా ప్రొఫెష‌న‌ల్ గా బాక్సింగ్ నేర్చుకుంటోంద‌ని అర్థ‌మ‌తోంది. ఈ ఫోటోషూట్ కి ఆస‌క్తిక‌ర క్యాప్ష‌న్ ని కూడా ఇచ్చింది. పార్టీలలో నేను పరిచయం చేయని నా వెర్షన్‌ని కలవండి.. అనే అంద‌మైన క్యాప్ష‌న్ ఇచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోషూట్ ఇన్ స్టాలో అభిమానుల్ని ఆక‌ట్టుకుంటోంది. క‌ళ్యాణి తీవ్ర‌మైన ప్ర‌య‌త్నాన్ని అభిమానులు అభినందిస్తున్నారు. ఇది క‌ళ్యాణి న‌టించే త‌దుప‌రి సినిమా కోసమేనా? అని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు.


32వ పుట్టిన‌రోజు:

యంగ్ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ ఏప్రిల్ 5న తన 32వ పుట్టినరోజును కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నారు. ఈ వేడుక‌ల‌కు సంబంధించిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో అంద‌రి దృష్టిని ఆకర్షించింది. ఆమె తండ్రి, ప్రముఖ చిత్రనిర్మాత ప్రియదర్శన్ షేర్ చేసిన ఫోటో వైరల్ అయింది. ఈ ఫోటోలో కళ్యాణి చాక్లెట్ కేక్ ముందు కనిపించ‌గా, ఆమె సోదరుడు సిద్ధార్థ్, అతని భార్య మెర్లిన్.. ముఖ్యంగా సిద్ధార్థ్ చేతుల్లో ఒక బిడ్డ ఉన్నారు. ఆ బిడ్డ సిద్ధార్థ్ - మెర్లిన్ ల కుమార్తె. అభిమానులు తమ ఆశ్చర్యం, ఆనందాన్ని వ్యక్తం చేసారు. ``ప్రియదర్శన్ తాతయ్య అయ్యాడని తెలియదా!``..``బిడ్డ పేరు ఏమిటి?`` అని కొంద‌రు ప్ర‌శ్నించారు. ఈ సంవత్సరంతో 32 ఏళ్లు నిండిన కళ్యాణి, చెన్నైలోని త‌మ ఇంట్లో కుటుంబ సభ్యులతో బ‌ర్త్ డే వేడుకను జరుపుకున్నారు.

సిద్ధార్థ్ - మెర్లిన్ 2023లో వివాహం చేసుకున్నారు. అమెరికా పౌరుడు, విజువల్ ఎఫెక్ట్స్ నిర్మాత అయిన మెర్లిన్, చెన్నైలోని ఒక ఫ్లాట్‌లో జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో సిద్ధార్థ్ ని వివాహం చేసుకున్నారు. దీనికి సన్నిహితులు , బంధువులు మాత్రమే హాజరయ్యారు. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన మరక్కర్: అరబికడలింటే సింహం అనే చిత్రానికి VFX సూపర్‌వైజర్‌గా పనిచేసిన సిద్ధార్థ్ విజువల్ ఎఫెక్ట్స్ పరిశ్రమలో పని చేస్తూనే ఉన్నారు.