Begin typing your search above and press return to search.

ఇన్‌స్టాలో శుభ‌వార్త చెప్పిన క‌ళ్యాణ్ దేవ్

చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ - కళ్యాణ్‌దేవ్ జంట‌ బ్రేక‌ప్ గురించి తెలిసిందే. హీరోగాను క‌ళ్యాణ్ దేవ్ కెరీర్ కి సంబంధించిన సంద‌డి క‌నిపించ‌లేదు

By:  Tupaki Desk   |   21 Dec 2023 5:26 PM GMT
ఇన్‌స్టాలో శుభ‌వార్త చెప్పిన క‌ళ్యాణ్ దేవ్
X

చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ - కళ్యాణ్‌దేవ్ జంట‌ బ్రేక‌ప్ గురించి తెలిసిందే. హీరోగాను క‌ళ్యాణ్ దేవ్ కెరీర్ కి సంబంధించిన సంద‌డి క‌నిపించ‌లేదు. సూపర్ మచ్చి- విజేత చిత్రాల త‌ర్వాత సినీరంగంలో అత‌డు క‌నిపించ‌లేదు. ఒక‌ట్రెండు సినిమాలు చేసినా వాటి గురించి అంత‌గా ప్ర‌చారం ద‌క్క‌లేదు. ఇక‌పైనా సినీ హీరోగా త‌న కెరీర్ గురించి క‌ళ్యాణ్ దేవ్ ఆలోచ‌న ఏమిట‌న్న‌ది కూడా తెలీదు.


కొంత గ్యాప్ తర్వాత క‌ళ్యాణ్ దేవ్ సోష‌ల్ మీడియాలో త‌మ కుటుంబంలోని ఒక శుభ‌క‌ర‌మైన వార్త‌ను అభిమానుల‌తో షేర్ చేస్కున్నారు. త‌న సోద‌రి ఐశ్వ‌ర్య లంక‌ సీమంతం ఫోటోల‌ను షేర్ చేసి, కుటుంబం పెరుగుతోంద‌ని వ్యాఖ్యానిస్తూ ఆనందం వ్య‌క్తం చేసాడు. త‌న సోద‌రి, ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఉన్న ఫోటోల‌ను క‌ళ్యాణ్ దేవ్ షేర్ చేసాడు. త‌న సోద‌రి బావ గారితో కలిసి ఉన్న ఫోటోను క‌ళ్యాణ్ దేవ్ షేర్ చేసారు.


అయితే క‌ళ్యాణ్ దేవ్ త్వ‌ర‌లోనే ఓ ఇంటివాడ‌వ్వాల‌ని శుభ‌వార్త చెప్పాల‌ని ప‌లువురు అభిమానులు ఇన్ స్టా వేదిక‌గా కోరారు. క‌ళ్యాణ్ దేవ్ తండ్రి కెప్టెన్ కిషన్ వ్యాపారవేత్త. ప్ర‌స్తుతం తండ్రి వ్యాపారాల‌ను క‌ళ్యాణ్ దేవ్ నిర్వ‌హిస్తున్నార‌ని గుస‌గుస‌లు ఉన్నాయి.