Begin typing your search above and press return to search.

దివాలీ రోజు క‌ళ్యాణ్ దేవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్!

అందులో క‌ళ్యాణ్ దేవ్ తెలుపు రంగు దుస్తులు దధ‌రించి ఇల్లంతా ప్ర‌మిద‌ల‌తో అలంక‌రించి జ్యోతులు వెలిగిస్తున్నాడు. ఆప‌క్క‌నే పాప కూర్చుని దీపాల్ని ప‌రిశీలిస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

By:  Tupaki Desk   |   12 Nov 2023 3:05 PM GMT
దివాలీ రోజు క‌ళ్యాణ్ దేవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్!
X

క‌ళ్యాణ్ దేవ్ చాలా రోజుల త‌ర్వాత ఇన్ స్టాలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడు. దివాలీ సంద‌ర్భంగా పాప‌తో వేడుక సెల‌బ్రేట్ చేసుకుంటోన్న ఓ ఫోటోని పోస్ట్ చేసాడు. అందులో క‌ళ్యాణ్ దేవ్ తెలుపు రంగు దుస్తులు దధ‌రించి ఇల్లంతా ప్ర‌మిద‌ల‌తో అలంక‌రించి జ్యోతులు వెలిగిస్తున్నాడు. ఆప‌క్క‌నే పాప కూర్చుని దీపాల్ని ప‌రిశీలిస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.


ఈ పోటోపై ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా పోస్ట్ చేసాడు. 'మీరందరూ మీ స్వంత కాంతిని వెలిగించండి! అంద‌రికీ దీపావళి శుభాకాంక్షలు' అని రాసాడు. సాధార‌ణంగా ఇంట్లో పండుగ సంద‌ర్భంలో మొద‌టి దీపాన్ని మ‌హిళ‌లు వెలిగిస్తారు. ఆ త‌ర్వాత పురుషులు సీన్ లోకి దిగుతారు. కానీ ఇక్క‌డ క‌ళ్యాణ్ దేవ్ లో సోలోగా దీపం వెలిగించి..మిగ‌తా వారిని అలాగే వెలిగించండని పోస్ట్ చేసాడు.


ఇది నెట్టింట వైర‌ల్ గా మారింది. క‌ళ్యాణ్ దేవ్ టాలీవుడ్ కి సుప‌రిచిత‌మే. 'విజేత' సినిమాతో న‌టుడిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. తొలి సినిమాతోనే గుర్తింపు ద‌క్కించుకున్నాడు. అటుపై నాలుగేళ్ల గ్యాప్ అనంత‌రం 'సూప‌ర్ మ‌చ్చి'..'కిన్నెర సాని' చిత్రాల్లో న‌టించాడు. ఈ రెండు గ‌తేడాది రిలీజ్ అయ్యాయి. ఆ త‌ర్వాత క‌ళ్యాణ్ దేవ్ నుంచి ఎలాంటి సినిమా రాలేదు. దీంతో సోష‌ల్ మీడియాలో యాక్టివిటీ కూడా త‌గ్గించాడు.


ఇండ‌స్ట్రీలో కూడా క‌ళ్యాణ్ పేరు పెద్ద‌గా వినిపించ‌డం లేదు. మ‌రి యంగ్ హీరో కెరీర్ ప్లానింగ్ ఎలా చేస్తున్నాడు? అన్న‌ది తెలియాలి. సినిమాల్లో కొన‌సాగుతాడా? లేక మ‌ళ్లీ వ్యాపారాల్లో బిజీ అవుతాడా? అన్న‌ది చూడాలి. సినిమాల్లోకి రాక‌ముందు క‌ళ్యాణ్ దేవ్ వ్యాపార రంగాల్లో కొన‌సాగిన‌ట్లు తెలుస్తోంది. అటుపై కొన్నాళ్ల‌కు కొత్త ర‌క‌మైన జీవితాన్ని ప్రారంభించాడు.