క్లైమాక్స్ లో కళ్యాణ్ రామ్.. ప్రశంసలే ప్రశంసలు...
టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్.. ఇప్పుడు అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీతో థియేటర్లలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 19 April 2025 7:39 AMటాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్.. ఇప్పుడు అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీతో థియేటర్లలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఆ సినిమాలో విజయశాంతి కీలక పాత్ర పోషించారు. మదర్ సెంటిమెంట్ తో ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఆ మూవీ అందరినీ ఆకట్టుకుంటోంది.
అయితే సినిమాలో కళ్యాణ్ రామ్, విజయశాంతి తల్లీ కొడుకులుగా నటించగా... వారిద్దరి మధ్య నడిచే డ్రామా ఫుల్ గా వర్కౌట్ అయిందనే చెప్పాలి. అదే సమయంలో మూవీలో క్లైమాక్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతీ ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్లు.. సినిమాకు క్లైమాక్స్ మెయిన్ అసెట్.
నిజానికి తల్లీకొడుకులు కలవడమనే క్లైమాక్స్ అందరూ ఊహించినదే. కానీ ఈ సినిమాలో డైరెక్టర్ ఊహించని ట్విస్ట్ చేశారు. దీంతో క్లైమాక్స్ మాత్రం ఎవరూ గెస్ చేయని రీతిలో ఉండి ఆకట్టుకుంటోంది. తల్లీకొడుకుల మధ్య బంధమంటే ఏంటో గొప్పగా చెప్పుకునేలా క్లైమాక్స్ మెప్పిస్తుందని అంతా చెబుతున్నారు. క్లైమాక్స్ కట్టిపడేస్తుందని అంటున్నారు.
అదే సమయంలో కళ్యాణ్ రామ్ పై ఓ రేంజ్ లో ప్రశంసలు కురుస్తున్నాయి. క్లైమాక్స్ లో ఆయన యాక్టింగ్ వేరే లెవెల్. తన కెరీర్ లోనే బెస్ట్ ఇచ్చారని చెప్పాలి. ఇప్పటికే పలు సినిమాలతో చెరగని ముద్ర వేసుకున్న ఆయన.. అర్జున్ సన్నాఫ్ వైజయంతి క్లైమాక్స్ తో ఎప్పటికీ సినీ ప్రియులకు గుర్తుండిపోతారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.
ఏ హీరో కూడా ఆ క్లైమాక్స్ కు ఓకే చెప్పరని, కానీ కళ్యాణ్ రామ్.. మాత్రం ఎంతో కాన్ఫిడెంట్ గా నటించారని సినీ ప్రియులు చెబుతున్నారు. ఆయన నటించలేదని, జీవించేశారని కొనియాడుతున్నారు. అయితే క్లైమాక్స్ టైమ్ లో థియేటర్లో ఆడియన్స్ థ్రిల్ అవుతున్నారు. మరికొందరు కన్నీళ్లు కారుస్తున్నారు. ఇంకొందరు చప్పట్లతో హోరెత్తిస్తున్నారు.
మొత్తానికి అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ అంతా ఒకెత్తు.. క్లైమాక్స్ మరో ఎత్తు.. అందులో కళ్యాణ్ రామ్ నటన ఇంకో ఎత్తు. బింబిసార తర్వాత మంచి హిట్ కోసం వెయిట్ చేసిన ఆయన.. ఇప్పుడు సాలిడ్ సక్సెస్ ను అందుకున్నట్లే. రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో సినిమా మెప్పిస్తూనే ఉంది. క్లైమాక్స్ కు గాను కళ్యాణ్ రామ్ ప్రశంసలు అందుకుంటూనే ఉన్నారు.