Begin typing your search above and press return to search.

కల్యాణ్ జ్యువెలర్స్ నవరాత్రి వేడుకలో మెరిసిన సినీ తారలు

భారతీయ సినిమా, సంప్రదాయం, గ్లామర్‌లను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన కల్యాణ్ జ్యువెలర్స్ నవరాత్రి వేడుక సినీ ప్రముఖుల సందడితో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

By:  Tupaki Desk   |   19 Oct 2026 12:28 PM IST
కల్యాణ్ జ్యువెలర్స్ నవరాత్రి వేడుకలో మెరిసిన సినీ తారలు
X

భారతీయ సినిమా, సంప్రదాయం, గ్లామర్‌లను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన కల్యాణ్ జ్యువెలర్స్ నవరాత్రి వేడుక సినీ ప్రముఖుల సందడితో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్, సారా అలీ ఖాన్ నుంచి దక్షిణాది ప్రముఖులు నాగార్జున, జయరామ్, శివకార్తికేయన్ వరకు పలువురు తారలు ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు.




పండుగకు తగిన సంప్రదాయ దుస్తులు, కల్యాణ్ జ్యువెలర్స్ ప్రత్యేకంగా రూపొందించిన ఆభరణాలతో తారలు మెరిసిపోయారు. కళ్లు చెదిరే హారాలు, సంప్రదాయ నగలు ప్రతి లుక్‌కు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. ఆభరణాల ప్రత్యేకత, తారల స్టైలింగ్ ఈ వేడుకకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.




భారతీయ మెట్ గాలాను తలపించేలా వైభవంగా జరిగిన ఈ వేడుకలో ఎవరు హాజరయ్యారు అనే ఆసక్తితో పాటు, వారు ధరించిన ఆభరణాలు, సంప్రదాయ దుస్తులపైనా అందరి దృష్టి నిలిచింది. భారతీయ సంస్కృతి, ఆభరణాల కళాత్మకత, సినీ గ్లామర్ కలిసిన ఈ వేడుక మరోసారి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.