కల్పిక, పబ్ మేనేజ్మెంట్ మధ్య లొల్లి.. పోలీసులు ఏమన్నారంటే?
కల్పిక ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా తన ఫ్రెండ్స్ తో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ కు వెళ్లగా.. అక్కడ నిర్వాహకులకు, ఆమెకు మధ్య గొడవ జరిగింది.
By: Tupaki Desk | 1 Jun 2025 10:28 AM ISTటాలీవుడ్ నటి కల్పిక రీసెంట్ గా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. కల్పిక ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా తన ఫ్రెండ్స్ తో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ కు వెళ్లగా.. అక్కడ నిర్వాహకులకు, ఆమెకు మధ్య గొడవ జరిగింది. అందుకు సంబంధించిన వీడియోను ఆమెనే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
కల్పిక పోస్ట్ చేసిన వీడియో ప్రకారం, తన స్నేహితులతో కలిసి పుట్టినరోజు వేడుకలకు గాను ప్రిజం పబ్ కు వెళ్ళింది. అక్కడ బర్త్ డే కేక్ ను తీసుకురావడం గురించి పబ్ సిబ్బంది, కల్పిక మధ్య వాగ్వాదం జరిగింది. ఆ వీడియోను పోస్ట్ చేసి.. పబ్బ సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని, బుతాలు తిట్టారని ఆమె ఆరోపించింది.
ఆ సమయంలో తనను డ్రగ్గిస్ట్ అంటూ అవమానించారని ఆరోపణలు చేసింది కల్పిక. తన గౌరవం దెబ్బతిందని, మానసికంగా సైతం వేదన చెందినట్టు సోషల్ మీడియాలో తెలిపింది. ఆ తర్వాత పబ్ మేనేజ్మెంట్ పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పిన కల్పిక.. వాళ్లు కూడా అలాగే ప్రవర్తించారని కల్పిక ఆరోపించింది.
కానీ పోలీసులు మాత్రం తాము కల్పిక నుంచి ఫిర్యాదు అందుకున్నట్లు, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మొత్తానికి కల్పిక, పబ్ మేనేజ్మెంట్ మధ్య ఘర్షణ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒక్కొక్కరు ఒక్కోలా రెస్పాండ్ అవుతున్నారు. జోరుగా ఆ విషయం కోసం డిస్కస్ చేసుకుంటున్నారు.
కాగా కల్పిక విషయానికొస్తే.. 2009లో తన యాక్టింగ్ కెరీర్ ను స్టార్ట్ చేసింది. రామ్ చరణ్ ఆరెంజ్ సినిమాలో జెనీలియా స్నేహితురాలిగా నటించి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన అమ్మడు.. ఆ తర్వాత వరుస మూవీ ఛాన్సులు అందుకుని సత్తా చాటింది. ఇప్పటి వరకు ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది కల్పిక.
జులాయి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సారొచ్చారు, పడి పడి లేచే మనసు, హిట్ ఫస్ట్ కేస్, యశోద వంటి వివిధ సినిమాల్లో కనిపించింది. కొద్ది రోజులుగా ఆమెకు అవకాశాలు మాత్రం తగ్గాయి. అడపాదడపా సినిమాల్లో మాత్రమే యాక్ట్ చేస్తోంది. ఇప్పుడు పబ్ తో జరిగిన గొడవతో వార్తల్లో నిలిచింది.
