Begin typing your search above and press return to search.

నా కుతూరుకు మెంటల్ డిజార్డర్.. బాంబ్ పేల్చిన నటి తండ్రి?

తనకు సిగరెట్లు కావాలని కోరగా, రిసార్ట్ సిబ్బంది నుంచి స్పందన లేకపోవడం వల్ల ఆగ్రహం వ్యక్తం చేసింది.

By:  Tupaki Desk   |   1 Aug 2025 12:50 PM IST
నా కుతూరుకు మెంటల్ డిజార్డర్.. బాంబ్ పేల్చిన నటి తండ్రి?
X

సినీ నటి కల్పిత కొంతకాలంగా వరుస వివాదాల్లో చిక్కుకుంటుంది. ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ లోని ఓ పబ్ లో నిర్వాహకులతో వివాదం పెట్టుకున్న కల్పిక, రీసెంట్ గా ఓ రిసార్ట్ లో హంగామా చేసింది. ఆమెపై పబ్ యాజమాన్యం కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సోమవారం మొయినాబాద్ లోని బ్రౌన్ టౌన్ రిసార్ట్ కు వెళ్లిన ఆమె, సాయంత్రం రిసెప్షనిస్ట్ లతో గొడవకు దిగింది.

తనకు సిగరెట్లు కావాలని కోరగా, రిసార్ట్ సిబ్బంది నుంచి స్పందన లేకపోవడం వల్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదంతా వీడియో రికార్డ్ చేసి తానే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్ల భిన్నంగా స్పందిస్తున్నారు. ఇలా కొద్దిరోజులుగా నటి కల్పిక తరచూ వార్తల్లో నిలుస్తోంది.

అయితే ఆమె వ్యవహరంలో ఇప్పుడు కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. కల్పికకు మెంటల్ డిజార్డర్ తో బాధపడుతుందని ఆమె తండ్రి సంఘవార్ గణేష్ స్వయంగా పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేశారు. అందువల్ల ఆమె న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ గొడవలు చేస్తుందని ఆయన తెలిపారు.

గతంలో ఇదే సమస్యపై తన కుమార్తెను రిహబిలిటేషన్ సెంటర్లో చేర్పించినట్లు సంఘవార్ గణేష్ చెప్పారు. అయితే ఆమె అక్కడ ట్రీట్ మెంట్ నుంచి తిరిగి వచ్చేసిందట. రెండేళ్లుగా ట్రీట్ మెంట్ లేకపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్యకు సైతం ప్రయత్నించిందని తెలిపారు. అయితే ఆమె చేసే పనులతో తమకు ఎలాంటి సంబంధం లేదని కల్పిక తండ్రి పోలీసులతో చెప్పినట్లు సమాచారం. తన ఫిర్యాదుకు స్పందించి కల్పికను మళ్లీ రీహబిలిటేషన్ సెంటర్ కు తరలించేలా చూడాలని గణేష్ పిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తుంది.

మరోవైపు, ఈమె చేస్తున్న ఆ న్యూసెన్స్ పై సోషల్ మీడియాలో భిన్నంగా స్పందనలు వస్తున్నాయి. కల్పిక కావాలనే ఫేమ్ అయ్యేందుకు ఇలా చేస్తుందని కొందరు కామెంట్లు పెడితే, నిజంగానే తనకు మెంటల్ డిజార్డర్ సమస్య ఉందేమో అని అంటున్నారు. ఇక మరి కొందరైతే ఈ పోలీసులు కేసులు తప్పించుకునేందుకు ఇదో కొత్త కథ అని అభిప్రాయపడుతున్నారు. మరి ఏది నిజమో చూడాల్సి ఉంది.