Begin typing your search above and press return to search.

కల్కి 2898AD: కమల్ మరో విశ్వరూపమే..

కాబట్టి లోక నాయకుడిని మరొక రేంజ్ లో చూపిస్తాడని అనుకుంటున్నారు. ఇక ఈరోజు బర్త్డే సందర్భంగా ఒక ఆర్ట్ ఫామ్ పోస్టర్ ను విడుదల చేశారు.

By:  Tupaki Desk   |   7 Nov 2023 10:06 AM GMT
కల్కి 2898AD: కమల్ మరో విశ్వరూపమే..
X

నటన ప్రపంచంలో ఒక నాయకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న కమల్ హాసన్ రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ ప్రాజెక్టులలో కనిపించబోతున్నారు. ఇప్పటికే విక్రమ్ సినిమాతో ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయినా కమల్ హాసన్ నెక్స్ట్ అంతకుమించి అనేలా క్యారెక్టర్స్ తో మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు.


ఇక నేడు కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన ప్రాజెక్టుల నుంచి స్పెషల్ విషెస్ అయితే అందుతున్నాయి. ముఖ్యంగా కమల్ మణిరత్నం కాంబినేషన్లలో రానున్న ప్రాజెక్టుపై అంచనాలు అయితే మామూలుగా లేవు. తగ్ లైఫ్ అనే ఆ ప్రాజెక్టు కు సంబంధించిన ఒక స్పెషల్ ఇంట్రడక్షన్ వీడియోను కూడా విడుదల చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ఇక కమల్ హాసన్ ప్రభాస్ కల్కి 2898AD లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. వైజయంతి ప్రొడక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ 3 విభిన్నమైన షేడ్స్ లో కనిపించబోతున్నారు. సినిమాలో కమల్ హాసన్ పాత్ర కూడా కీలకంగా ఉండబోతుంది. ఇక ఆయనకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

500 కోట్లు భారీ బడ్జెట్లో పొందుతున్న ఈ సినిమాలో కమల్ హాసన్ ను తీసుకున్నారు అంటే క్యారెక్టర్ లో కంటెంట్ చాలా బలంగానే ఉంటుంది అని ఊహించవచ్చు. అందులోనూ దర్శకుడు నాగ్ అశ్విన్ టాలెంట్ గురించి అందరికీ తెలిసిందే. కాబట్టి లోక నాయకుడిని మరొక రేంజ్ లో చూపిస్తాడని అనుకుంటున్నారు. ఇక ఈరోజు బర్త్డే సందర్భంగా ఒక ఆర్ట్ ఫామ్ పోస్టర్ ను విడుదల చేశారు.

ఆయనకు స్పెషల్ గా బర్త్ డే విషెస్ కూడా అందించారు. కల్కి సినిమాలో ఆయన క్యారెక్టర్ కు సంబంధించి కొన్ని గాసిప్స్ కూడా వచ్చాయి. ఇందులో కమల్ హాసన్ నెగటివ్ షేడ్స్ ఉంటాయని కూడా టాక్ వచ్చింది. సైంటిస్ట్ గానే కాకుండా హీరోకు అడ్డుగా నిలబడే వ్యక్తిగా కథలో అతని పాత్ర చాలా కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక సాధారణంగా కమల్ హాసన్ ఇతర హీరోలలో సినిమాలలో నటించడం అరుదు. ఒకవేళ నటిస్తే ఆ పాత్ర ఎంతో బలంగా ఉంటే కానీ ఒప్పుకోరు అని గతంలోనే రుజువు చేశారు. ఇక ఈసారి కల్కి సినిమా చేయడానికి ఆయన ఒప్పుకున్నారు అంటే మరొక విశ్వరూపం లాంటి క్యారెక్టర్ బయటికి వస్తుంది అని అనిపిస్తుంది.