Begin typing your search above and press return to search.

కల్కి 2898AD - ట్రెండింగ్ లో నెంబర్ వన్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రాబోతున్న "కల్కి 2898 ఏడి" సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

By:  Tupaki Desk   |   11 Jun 2024 10:15 AM GMT
కల్కి 2898AD - ట్రెండింగ్ లో నెంబర్ వన్..
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో రాబోతున్న "కల్కి 2898 ఏడి" సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. నాగ్ అశ్విన్ ఈ ప్రాజెక్ట్‌ను సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించారు, ఇందులో పురాణాల స్ఫూర్తిని జోడించి ఆకట్టుకునే కథాంశాన్ని సృష్టించారు. ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలవడంతో ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగాయి.


ట్రైలర్ చూస్తే, నాగ్ అశ్విన్ తన సృజనాత్మకతను మరో స్థాయికి తీసుకెళ్లారని అర్థమవుతుంది. ఈ కథలో కాశీ నగరం నేపథ్యంగా ఉండి, భూమిపై జరిగిన పోరాటాన్ని చూపించనున్నారు. ట్రైలర్‌ విడుదలైన తర్వాత, అశ్విన్ విజన్ మరియు టాలెంట్‌కు విపరీతమైన ప్రశంసలు లభించాయి. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ చిత్రాల నుంచి తీసుకున్న ఇన్‌స్పిరేషన్లను చూసి, హాలీవుడ్ స్టాండర్డ్స్‌లో ఈ సినిమా ఉండబోతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఇక యూట్యూబ్ లో ఈ ట్రైలర్ సంచలనం సృష్టించే దిశగా కొనసాగుతోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డులు బ్రేక్ అయ్యాయి. ప్రభాస్ ట్రాక్ రికార్డ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో నెంబర్ వన్ స్థానంలో కల్కి ట్రైలర్ ట్రెండ్ అవుతుంది. ఈ దెబ్బతో సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా న్యూ రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు.

ఈ చిత్రంలో ప్రభాస్‌ తో పాటు దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ నటీనటులు కనిపించనున్నారు. సీనియర్ హీరోయిన్ శోభన, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ వంటి వారు కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కీర్తి సురేష్ తన వాయిస్ ఓవర్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

ఇక ఈ సినిమా విడుదల జూన్ 27నగా ప్లాన్ చేసారు. ట్రైలర్‌ విడుదల చేసిన వెంటనే సోషల్ మీడియాలో ప్రేక్షకులు, సినీ విశ్లేషకులు పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు. కథ, కథనాలు, విజువల్స్‌ అన్నీ కలిసి ఒక అద్భుతమైన అనుభవాన్ని ప్రేక్షకులకు అందించేలా ఉన్నాయని తెలుస్తోంది. హాలీవుడ్ నుండి స్ఫూర్తి తీసుకుని, ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో తీసుకురావడానికి నాగ్ అశ్విన్ ఎంతగానో కృషి చేశారు.

ఈ సినిమా ట్రైలర్‌ చూస్తే, ఇది నాగ్ అశ్విన్ సృష్టించిన ఒక ప్రత్యేకమైన ప్రపంచంగా నిలుస్తుంది. మొత్తం మీద, "కల్కి 2898 ఏ.డి" ప్రభాస్ కెరీర్‌లో మరో మైలురాయి అవుతుందని, ప్రేక్షకులకు మరపురాని అనుభవం కలిగిస్తుందని అనిపిస్తోంది. ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.