Begin typing your search above and press return to search.

కల్కి - ఆ సెంటిమెంట్ డేట్ లో రిస్క్ కూడా..

కానీ మళ్ళీ ఊహించిన విధంగా రెండు భాగాలుగా విభజించి విడుదల చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ 2024 మే 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

By:  Tupaki Desk   |   12 Jan 2024 1:30 PM GMT
కల్కి - ఆ సెంటిమెంట్ డేట్ లో రిస్క్ కూడా..
X

సలార్ సినిమాతో మొత్తానికి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్ సొంతం చేసుకున్న ప్రభాస్ నెక్స్ట్ కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దాదాపు 550 కోట్ల భారీ బడ్జెట్లో పొందుతున్న ఈ సినిమాలో గ్రాఫిక్స్ మాత్రం నెవర్ బిఫోర్ అనేలా ఇండియన్ స్క్రీన్ పై కనిపించబోతున్నట్లు చెబుతున్నారు.


అయితే ఈ సినిమాలో మొదట కేవలం ఒక భాగంతోనే ముగించాలని అనుకున్నారు. కానీ మళ్ళీ ఊహించిన విధంగా రెండు భాగాలుగా విభజించి విడుదల చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ 2024 మే 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఇక వైజయంతి మూవీస్ ఈ డేట్ ను ఎంచుకోవడానికి కూడా బలమైన కారణం ఉంది.

ఈ సంస్థలో వచ్చిన మొదటి బిగ్ బడ్జెట్ మూవీ జగదేకవీరుడు అతిలోకసుందరి అదే తేదీన వచ్చింది. అంతే కాకుండా ఆ నిర్మాణ సంస్థకు ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్టు కూడా. అలాగే సావిత్రి బయోపిక్ మహానటి కూడా ఆ సెంటిమెంట్ రోజే విడుదల అయింది. ఇది కూడా మంచి లాభాలను అందించింది. ఇక మే 9 బాగా కలిసి రావడంతో వైజయంతి మూవీస్ ఇప్పుడు కల్కి సినిమాను కూడా అప్పుడే విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు.

అధికారికంగా ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. అంతా బాగానే ఉంది కానీ ఆ సెంటిమెంట్ డేట్ లో వైజయంతికి పెద్దగా ప్రాఫిట్స్ ఇవ్వని సినిమాలు కూడా వచ్చాయి. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కంత్రి సినిమా అలాగే మహేష్ బాబు మహర్షి కూడా అదే డేట్ కు వచ్చినవే. ఈ రెండు సినిమాలు కూడా పెద్దగా నష్టాలు కలిగించలేదు. అలాగని పెట్టిన పెట్టుబడికి ఎక్కువ స్థాయిలో ప్రాఫిట్స్ కూడా అందించలేదు. జస్ట్ యావరేజ్ టాక్స్ సొంతం చేసుకున్నాయి.

రెండు సినిమాల బిజినెస్ విషయంలో నిర్మాత కూడా పెద్దగా సంతృప్తి చెందలేదు. అంటే వైజయంతి సంస్థకు మే తొమ్మిది బిగ్ సక్సెస్ లు ఇవ్వడమే కాకుండా కంత్రి మహర్షి లాంటి సినిమాలతో ఊహించని షేక్స్ కూడా ఇచ్చాయి. కాబట్టి ఈ మే 9 సెంటిమెంట్ కంటే కూడా సినిమా కంటెంట్ బలంగా క్లిక్ అవ్వాలి. అప్పుడే పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తాయి. యవరాజ్ టాక్ వచ్చినా ఇప్పట్లో చాలా రిస్క్. కాబట్టి టాక్ హై రేంజ్ లో ఉండాలి. దర్శకుడు నాగ్ అశ్విన్ మీద అయితే ఆడియన్స్ చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు. అతని మేకింగ్ విధానం తప్పకుండా బాగుంటుంది అని అనుకుంటున్నారు. మరి కల్కి వైజయంతి వారికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.