Begin typing your search above and press return to search.

కల్కి@50... ఇంకెప్పుడు మొదలు

నేటి నుంచి సరిగ్గా 50 రోజులు మాత్రమే కల్కి విడుదల తేదీకి సమయం ఉంది.

By:  Tupaki Desk   |   9 May 2024 6:05 AM GMT
కల్కి@50... ఇంకెప్పుడు మొదలు
X

యంగ్‌ రెబల్‌ స్టాప్ ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ వరల్డ్‌ మూవీ కల్కి 2898 AD చిత్రం అన్ని అనుకున్నట్లుగా జరిగితే నేడు విడుదల అవ్వాల్సి ఉంది. కానీ దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి ఉన్న నేపథ్యంలో సినిమా విడుదలకు సరైన సమయం కాదని భావించిన మేకర్స్‌ జూన్‌ 27కి వాయిదా వేసిన విషయం తెల్సిందే.

నేటి నుంచి సరిగ్గా 50 రోజులు మాత్రమే కల్కి విడుదల తేదీకి సమయం ఉంది. సాధారణంగా ఇలాంటి భారీ బడ్జెట్‌, క్రేజీ సినిమాలకు రెండు మూడు నెలల నుంచే ప్రచార హడావుడి మొదలు పెట్టాలి. పబ్లిసిటీ హంగామా ఇప్పటి వరకు కల్కి విషయంలో కనిపించక పోవడం పై ఫ్యాన్స్ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

కల్కి సినిమా నుంచి ఒక్క పాట కానీ, ఇతర విజువల్ ట్రీట్‌ కానీ రాలేదు. అయినా కూడా సినిమాకు బజ్ విపరీతంగా క్రియేట్‌ అయ్యింది. అయితే ఇప్పటికి అయినా మేకర్స్‌ కల్కి సినిమా ప్రమోషన్ ను మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది అంటూ సినీ విశ్లేషకులు మరియు సినీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

ప్రభాస్ గత చిత్రం సలార్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా కు దర్శకుడు ప్రశాంత్‌ నీల్ భారీ ఎత్తున ప్రమోషన్ చేశాడు. అందుకే భారీ మొత్తంలో వసూళ్లు నమోదు అయ్యాయి. అందుకే కల్కి సినిమాకి కూడా ఆ స్థాయిలో పబ్లిసిటీ చేస్తే బాగుంటుంది అనేవారు ఉన్నారు.

విడుదలకు ఇంకా 50 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో టీజర్‌ మరియు ట్రైలర్ లు బ్యాక్ టు బ్యాక్ విడుదల చేసి జనాల్లోకి కల్కి ని మరింతగా తీసుకు వెళ్లడం మంచిది. దర్శకుడు నాగ్‌ అశ్విన్ ఇప్పటి వరకు కూడా సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ తోనే బిజీగా ఉన్నాడు.

వదిలితే జూన్ లో కూడా సినిమా కి పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ చేస్తూనే ఉంటాడా అంటూ కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కల్కి సినిమా ప్రమోషన్ మొదలు పెట్టాలి అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ నాగ్‌ అశ్విన్‌ కు సోషల్‌ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికి అయినా కల్కి సందడి షురూ అయ్యేనా చూడాలి.