Begin typing your search above and press return to search.

కల్కి.. రేట్లు ఎలా ఉన్నాయి?

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో మూవీ రైట్స్ కోసం అశ్వినీదత్ భారీగానే డిమాండ్ చేస్తున్నారంట.

By:  Tupaki Desk   |   3 April 2024 4:09 AM GMT
కల్కి.. రేట్లు ఎలా ఉన్నాయి?
X

డార్లింగ్ ప్రభాస్ లీడ్ రోల్ లో నాగ్ అశ్విన్ సిద్ధం చేస్తోన్న పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898ఏడీ. 600 కోట్లకి పైగా బడ్జెట్ తో అశ్వినీదత్, స్వప్నదత్ ఈ సినిమాని నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 22 భాషలలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. త్వరలో మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జూన్ లేదా జులై లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. మరో వైపు ఈ సినిమా బిజినెస్ డీల్స్ క్లోజ్ చేసే పనిలో చిత్ర యూనిట్ ఉంది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో మూవీ రైట్స్ కోసం అశ్వినీదత్ భారీగానే డిమాండ్ చేస్తున్నారంట. ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో హైవోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ మూవీ కథాంశం ఉండబోతోంది. బిగ్ స్క్రీన్ పై సరికొత్త ప్రపంచాన్ని నాగ్ అశ్విన్ కల్కిలో చూపించబోతున్నాడు. ఒక్కసారి మూవీ టీజర్ వస్తే ప్రపంచ మొత్తం ఈ సినిమా వైపు చూస్తుందని చిత్ర యూనిట్ బలంగా నమ్ముతుంది. అందుకే భారీ రేట్లు చెబుతున్నారు.

ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, అమితాబచ్చన్, దీపికా పదుకునే, దిశా పటాని లాంటి స్టార్ క్యాస్టింగ్ ఈ సినిమాలో ఉన్నారు. దీంతో వరల్డ్ వైడ్ గా కల్కి ఇంపాక్ట్ గట్టిగా ఉంటుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ నైజాం రైట్స్ ని ఏషియన్ సునీల్ 72 కోట్లకి కొన్నారని తెలుస్తోంది. అక్కడ RRR లాంటి సినిమా కూడా ఇదే రేంజ్ లో అమ్ముడైంది. ఇక ఇప్పుడు ప్రభాస్ కెరీర్ లోనే హయ్యెస్ట్ రేటు రావడం విశేషం

అలాగే సీడెడ్ రైట్స్ ఎన్ వి ప్రసాద్ 30 కోట్లకి తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. సీడెడ్ లో 20 కోట్లు అంటేనే హైయెస్ట్. అలాంటిది 30 కోట్లు అంటే పెద్ద రిస్క్ అని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. ఇక ఉత్తరాంధ్ర కోసం 22 కోట్లు అడుగుతున్నారంట. ప్రస్తుతం అక్కడి బయ్యర్లతో చర్చలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన ఏరియాలకి సంబంధించి కూడా డీల్స్ క్లోజ్ చేసే పనిలో అశ్వినీ దత్ ఉన్నారు.

నిర్మాత చెబుతోన్న రేట్, బయ్యర్లు ఎక్స్ పెక్ట్ చేస్తున్న ధర మ్యాచ్ కాకపోవడంతో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. జూన్ చివర్లో లేదా జులై ఫస్ట్ వీక్ లో మూవీ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. రిలీజ్ డేట్ ఫైనల్ అయిన తర్వాత మేగ్జిమమ్ డీల్స్ అన్ని క్లోజ్ చేసే ఛాన్స్ ఉందంట. వరల్డ్ వైడ్ గా 400 కోట్లకు పైగా థీయాట్రికల్ బిజినెస్ ఈ సినిమాపై జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఆడియన్స్ అటెన్షన్ ని గ్రాబ్ చేస్తుంది అనేది తెలియాలంటే మాత్రం టీజర్ రిలీజ్ అయ్యేంత వరకు ఎదురుచూడాల్సిందే.