Begin typing your search above and press return to search.

కల్కి 2898 AD: పాట కోసం కూడా కోట్ల ఖర్చు..

డార్లింగ్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898ఏడీ జూన్ 27న థియేటర్స్ లోకి రాబోతోంది.

By:  Tupaki Desk   |   15 Jun 2024 4:04 AM GMT
కల్కి 2898 AD: పాట కోసం కూడా కోట్ల ఖర్చు..
X

డార్లింగ్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898ఏడీ జూన్ 27న థియేటర్స్ లోకి రాబోతోంది. 600+ కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ లో నిర్మించారు. ఇండియన్ ఫ్యూచరిస్టిక్ మూవీగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కచ్చితంగా వరల్డ్ వైడ్ గా కల్కి 2898ఏడీ వండర్స్ క్రియేట్ చేస్తుందని ట్రేడ్ పండితులు నమ్ముతున్నారు.


ఇప్పటికే మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, యానిమేషన్ వెబ్ సిరీస్ బాగా క్లిక్ అయ్యాయి. అలాగే సినిమా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన కారు కూడా అందరిని ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ సాంగ్ ని ప్లాన్ చేశారంట. ఈ సాంగ్ ని ఏకంగా 2 కోట్లతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ కోసం స్టార్ సింగర్ దల్జీత్ దూసాంజ్ ని రంగంలోకి దించారంట.

ఈ సాంగ్ లో దల్జీత్ దూసాంజ్ తో పాటు ప్రభాస్ కూడా కనిపిస్తాడంట. నేడు(జూన్15) సాంగ్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నంలో చిత్ర యూనిట్ ఉంది. అయితే సాంగ్ ని ఐదు భాషలలో పాడుతున్నారా లేదంటే ఒక హిందీలోనే ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. దల్జీత్ బాలీవుడ్ లో స్టార్ సింగర్ గా, నటుడిగా ఉన్నాడు. సోషల్ మీడియాలో అతనికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. యుట్యూబ్ లో దల్జీత్ పాడిన సాంగ్స్ కి దేశ వ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది.

అందుకే దల్జీత్ ని కల్కి మూవీ ప్రమోషన్ సాంగ్ తీసుకొచ్చారంట. సినిమాకి మొదటి రోజే భారీ ఓపెనింగ్స్ వచ్చేలా చిత్ర యూనిట్ గట్టిగానే ప్లాన్ చేస్తోంది, 2డి, 3డి వెర్షన్స్ లో కల్కి 2898 ఏడీ సినిమాని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో దీపికా పదుకునే, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామ పాత్రలో కనిపించబోతున్నారు. అలాగే కమల్ హాసన్ ప్రతినాయకుడైన కలి పురుషుడు పాత్రలో నటించారు.

అందుకే ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ చిత్రంగా కల్కి 2898 ఏడీ మూవీ రాబోతోంది. హాలీవుడ్ రేంజ్ లో మన సినిమా స్టాండర్డ్స్ ఏంటనేది కల్కి చూపిస్తుందని నాగ్ అశ్విన్ బలంగా నమ్ముతున్నారు. మరి ఈ ప్రమోషన్ సాంగ్ ప్రేక్షకులకి ఏ మేరకు కనెక్ట్ అవుతుందనేది వేచి చూడాలి.