Begin typing your search above and press return to search.

కల్కి జీతాలు.. అసలు లెక్కలు భారీగానే?

సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   25 April 2024 6:48 AM GMT
కల్కి జీతాలు.. అసలు లెక్కలు భారీగానే?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో కల్కి 2898 ఏడీ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హిందూ పురాణాల స్ఫూర్తితో సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ జోనర్ లో ఈ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై పాన్ ఇండియా లెవల్ లో భారీ హైప్ క్రియేట్ అయింది. సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కానీ ఈ మూవీ రిలీజ్ పై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది.

అయితే ఈ సినిమాను రూపొందిస్తున్న ప్రముఖ బ్యానర్ వైజయంతీ మూవీస్.. తమకు బాగా కలిసొచ్చిన మే9వ తేదీన కల్కిని విడుదల చేయనున్నట్లు ఎప్పుడో ప్రకటించేసింది. జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి అదే రోజున విడుదల అయ్యి మంచి హిట్ అయ్యాయి. దీంతో కల్కిని కూడా అప్పుడే రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ మే 13వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ సందర్భంగా కల్కి రిలీజ్ వాయిదా పడడం పక్కానే.

ఇప్పుడు కల్కి కొత్త రిలీజ్ డేట్ పై మేకర్స్ మల్లగుల్లాలు పడుతున్నారు. మే 30వ తేదీన రిలీజ్ చేయాలని డిస్ట్రిబ్యూటర్లు కోరుతుండగా.. జూన్ లో విడుదల చేయాలని మేకర్స్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి త్వరలో కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల అమితాబ్ లుక్ కూడా విడుదల చేశారు మేకర్స్.

ఇప్పుడు కల్కి సినిమాకు గాను వీరందరి రెమ్యునరేషన్స్ పై నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది. ఈ మూవీని వైజయంతీ బ్యానర్ రూ.600 కోట్లతో రూపొందిస్తున్నట్లు టాక్. అయితే ప్రొడక్షన్ కాస్ట్ కన్నా.. నటీనటుల రెమ్యునరేషన్లకే ఎక్కువ ఖర్చు అయినట్టు తెలుస్తోంది. దాదాపు రూ.250 కోట్లు.. కేవలం నటీనటుల కోసం ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ మూవీకి గాను ప్రభాస్ భారీ స్థాయిలో పారితోషికం అందుకున్నట్లు తెలుస్తోంది.

బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ బాగా పెరిగిన విషయం తెలిసిందే. అందుకు తగ్గట్లు కల్కి మేకర్స్ ఆయనకు రూ.150 కోట్లను రెమ్యునరేషన్ గా ఇచ్చినట్లు టాక్. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కు చెరో రూ.20 కోట్ల రేంజ్ లో ఇచ్చినట్లు తెలుస్తోంది. దీపికా పదుకొణె రూ.20 కోట్లు, దిశా పటానీ రూ.5 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. మొత్తంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి లాభాలు సంపాదిస్తుందో చూడాలి.