Begin typing your search above and press return to search.

కల్కి జాగ్రత్తలు.. కొత్త టార్గెట్లు ఇవే!

ఈ గ్రాఫిక్స్ పనులు అనుకున్నట్లు వస్తే చెప్పిన డేట్ కి మూవీ రిలీజ్ అయిపోనుంది. లేదంటే మళ్ళీ వాయిదా పడొచ్చనే మాట వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   11 March 2024 3:55 AM GMT
కల్కి జాగ్రత్తలు.. కొత్త టార్గెట్లు ఇవే!
X

డార్లింగ్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ కల్కి 2898 ఏడీ. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. మే 9న ప్రపంచ వ్యాప్తంగా 22 భాషలలో రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. భారీ బడ్జెట్ తో సరికొత్త కాన్సెప్ట్ తో కల్కి మూవీ సిద్ధం అవుతోంది. ఇప్పటి వరకు ఇండియన్స్ సిల్వర్ స్క్రీన్ పై ట్రై చేయని ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉండబోతోంది.

కమల్ హాసన్ ప్రతినాయకుడిగా ఈ చిత్రంలో నటిస్తున్నారు. అమితాబచ్చన్, దీపికా పదుకునే, దిశా పటాని లాంటి స్టార్ యాక్టర్స్ కూడా కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. పాన్ వరల్డ్ మూవీగా ఇండియా నుంచి రాబోయే మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ఇండియన్ మైథాలజీ బేస్డ్ గా ఈ కథని నాగ్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్ పై రెండు భాగాలుగా ఆవిష్కరిస్తున్నారు.

పార్ట్ 1 షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ వర్క్ చేసుకుంటోంది. పార్ట్ 2 షూటింగ్ ప్రస్తుతం నడుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ఏడాది జనవరిలోనే కల్కి మూవీని రిలీజ్ చేస్తామని నాగ్ అశ్విన్ గత ఏడాది ప్రకటించారు. అయితే మూవీ సీజీవర్క్, కంప్లీట్ కాకపోవడంతో రిలీజ్ వాయిదాపడి మే 9కి వెళ్ళింది. ప్రస్తుతం సీజీ వర్క్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయంట.

ఈ గ్రాఫిక్స్ పనులు అనుకున్నట్లు వస్తే చెప్పిన డేట్ కి మూవీ రిలీజ్ అయిపోనుంది. లేదంటే మళ్ళీ వాయిదా పడొచ్చనే మాట వినిపిస్తోంది. పర్ఫెక్ట్ క్వాలిటీ గ్రాఫిక్స్ ని నాగ్ అశ్విన్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడు. ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ కావడంతో విజువల్ పరంగా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో నాసిరకం ఉంటే ఆడియన్స్ డిస్కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే క్వాలిటీ అవుట్ ఫుట్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.

ఒక వేళ ఈ సారి విజువల్ ఎఫెక్ట్స్ అవుట్ ఫుట్ సరిగా లేకుంటే మళ్ళీ రీ వర్క్ చేయించే ఛాన్స్ ఉందంట. అదే జరిగితే జులై 26 లేదంటే ఆగష్టు 15కి కల్కి చిత్రాన్ని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఈ రెండు తేదీలు ప్రస్తుతం సౌత్ లో మంచి ప్రీమియమ్ రిలీజ్ డేట్స్ గా ఉన్నాయి. ఆగష్టు 15న ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఆ డేట్స్ లో ప్రభాస్ కల్కి సినిమాతో వస్తే మాత్రం మిగిలిన వారు రేసు నుంచి తప్పుకోవాల్సిందే.