Begin typing your search above and press return to search.

కల్కి.. ఆ విషయంలో నో ఛేంజ్

అయితే ఈ మూవీ పక్కాగా మే 9వ తేదీనే రిలీజ్ అవుతున్నట్లు మూవీ టీమ్ చెబుతోంది. రిలీజ్ డేట్ లో ఎలాంటి ఛేంజ్ లేదని అంటోంది.

By:  Tupaki Desk   |   7 Feb 2024 6:53 AM GMT
కల్కి.. ఆ విషయంలో నో ఛేంజ్
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్ బేస్ గురించి, ఆయన స్టామినా గురించి అందరికీ తెలిసిందే. ఇటీవలే సలార్ సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. మరోసారి తన దెబ్బ ఎలా ఉంటుందో బాక్సాఫీస్ కు రుచి చూపించారు. అయితే ఇప్పటి వరకు ప్రభాస్ నుంచి వచ్చిన సినిమాలు ఒకెత్తు.. త్వరలో రాబోతున్న కల్కి 2898 ఏడీ మరో ఎత్తు అని చెప్పాలి.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక కంప్లీట్ ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ కథతో రాబోతున్నారు ప్రభాస్. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొణె, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుపుకుంటోంది.

ఈ మూవీ మే 9వ తేదీన గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవలే కల్కి మేకర్స్ ప్రకటించారు. అయితే ఆ డేట్ కు కల్కి రిలీజ్ అయ్యే అవకాశం లేదని వార్తలు వచ్చాయి. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ ఇంకా చాలా పెండింగ్ ఉందని, విడుదల వాయిదా పడుతుందని టాక్ నడుస్తోంది. అయితే ఈ మూవీ పక్కాగా మే 9వ తేదీనే రిలీజ్ అవుతున్నట్లు మూవీ టీమ్ చెబుతోంది. రిలీజ్ డేట్ లో ఎలాంటి ఛేంజ్ లేదని అంటోంది.

కల్కి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ తర్వాత ఒక్కసారిగా ప్రపంచం మొత్తం దృష్టి ఈ సినిమాపై పడింది. ఈ మూవీ గురించి చర్చలు సినీ ప్రియుల్లో మొదలయ్యాయి. సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ చిత్రం పురాణాలను టచ్ చేస్తూ తెరకెక్కుతోందని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ ఏకంగా ఐదు విభిన్న పాత్రల్లో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది.

కల్కి రెండు పార్ట్ లుగా రాబోతోంది. మొదటి పార్ట్ చివర్లో కమల్ ఎంట్రీ ఇస్తారట. కమల్ విశ్వరూపంతో క్లైమాక్స్ దద్దరిల్లిపోతుందట. సెకండ్ పార్ట్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసే స్దాయిలో ఈ క్లైమాక్స్ ను డిజైన్ చేశారట. మరి ఎన్నో భారీ అంచనాలు ఏర్పరచిన కల్కి మూవీ ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.