Begin typing your search above and press return to search.

కల్కి.. మళ్ళీ అదే లీకులు గోల!

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన ఎలాంటి విజువల్స్, ఫోటోలు బయటకి రాకుండా ఉండటం కోసం చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.

By:  Tupaki Desk   |   14 Nov 2023 4:40 AM GMT
కల్కి.. మళ్ళీ అదే లీకులు గోల!
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898 ఏడీ. భారీ బడ్జెట్ తో పాన్ వైజయంతీ మూవీస్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ గా ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో ఈ సినిమాని నాగ్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు. కల్కి కోసం సరికొత్తగా భవిష్యత్ మానవ ప్రపంచాన్ని నాగ్ అశ్విన్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు ఎవ్వరూ చేయని ప్రయోగం కల్కి కోసం నాగ్ అశ్విన్ చేస్తున్నారు. అందుకే వరల్డ్ వైడ్ గా ఈ సినిమాని వీలైనన్ని ఎక్కువ భాషలలో రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు. సౌత్ ఇండియా నుంచి రాబోతోన్న మొట్టమొదటి హాలీవుడ్ రేంజ్ మూవీ ఇదే కావడం విశేషం. కచ్చితంగా ఈ సినిమాతో ట్రెండ్ సెట్ చేయాలని నాగ్ అశ్విన్ భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన ఎలాంటి విజువల్స్, ఫోటోలు బయటకి రాకుండా ఉండటం కోసం చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అస్సలు సెల్ ఫోన్ ని షూటింగ్ ప్రదేశంలోకి అనుమతించడం లేదు. అలాగే సినిమాతో సంబంధం లేనివారిని కూడా రానివ్వడం లేదు. ఇన్ని రకాలుగా కల్కి షూటింగ్ విషయంలో జాగ్రత్త తీసుకుంటున్న కూడా కొన్ని ఫోటోలు బయటకి వస్తున్నాయి.

ఆ మధ్య మోనిటర్ లో ప్రభాస్ కి సంబందించిన షూటింగ్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అతి కష్టం మీద దానిని చిత్ర నిర్మాతలు ఆపారు. తరువాత మరింత జాగ్రత్తగా ఉన్నారు. కాని ఏదో రూపంలో ఫోటోలు బయటకు రావడం చిత్ర యూనిట్ ని ఆందోళన కలిగిస్తోంది. అభిమానులని కూడా ఈ సంఘటనలు టెన్షన్ పెడుతున్నాయి. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతున్నారు.

ఈ మూవీలో శ్రీ మహావిష్ణువు అవతారం అయిన కల్కిగా ప్రభాస్ నటిస్తున్నాడు. పరశురాముడి పాత్రలో అమితాబచ్చన్, కాలపురుషుడిగా నెగిటివ్ రోల్ లో కమల్ హాసన్ కనిపించబోతున్నారు. దీపికా పదుకునే హీరోయిన్ గా చేస్తోంది. దిశా పటాని ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది.