Begin typing your search above and press return to search.

ట్రెండ్ ఫాలో అవ్వని 'కల్కి 2898 AD'

దానికి కొనసాగింపుగా ఆ తర్వాత 'రెండు భాగాల' ట్రెండ్ ను మొదలుపెట్టారు.

By:  Tupaki Desk   |   22 Feb 2024 1:59 PM GMT
ట్రెండ్ ఫాలో అవ్వని కల్కి 2898 AD
X

పాన్ ఇండియా, ఫ్రాంచైజీ అనేవి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ గా మారాయి. క్రేజ్ కోసం, మార్కెట్ విస్తరించుకోవడం కోసం ఫిలిం మేకర్స్ అంతా ముందుగా 'పాన్ ఇండియా' ట్రెండ్ స్టార్ట్ చేశారు. దానికి కొనసాగింపుగా ఆ తర్వాత 'రెండు భాగాల' ట్రెండ్ ను మొదలుపెట్టారు. వీటికి ఎస్ఎస్ రాజమౌళి ఆద్యుడు అయినప్పటికీ, అందరూ అదే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. నిజంగానే అంత అవసరముందా? కథలో మ్యాటర్ ఉందా లేదా? అనేవి పక్కన పెడితే.. స్టార్ హీరోల సినిమాలను, భారీ బడ్జెట్ తో తీసే చిత్రాలను 2 పార్ట్స్ గా అనౌన్స్ చేయడం ఆనవాయితీగా మారిపోయింది. కానీ ఇప్పుడు దీనికి భిన్నంగా అలాంటి ప్రకటనేమీ లేకుండా వస్తోంది "కల్కి 2898 AD".

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా 'కల్కి 2898 AD'. వైజయంతీ మూవీస్ సంస్థ భారీ బడ్జెట్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించలేదు. 2 పార్ట్స్ గురించి మీడియా, సోషల్ మీడియాలలో రకరకాల వార్తలు వస్తున్నాయి కానీ.. మేకర్స్ సైడ్ నుంచి మాత్రం అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు.

'కల్కి 2898 AD' అనేది హిందూ పురాణాల ఆధారంగా రూపొందుతున్న ఇండియన్ ఎపిక్ సోషియో ఫాంటసీ సైన్స్-ఫిక్షన్ డిస్టోపియన్ చిత్రం. కథను మరింత విస్తరించడానికి అవకాశం దొరుకుతుంది. కచ్ఛితంగా రెండు మూడు భాగాలుగా చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ మేకర్స్ మాత్రం ట్రెండ్ ఫాలో అవ్వలేదు. క్రేజ్ కోసమో, బిజినెస్ చేసుకోడానికో 2 పార్ట్స్ గా తీస్తున్నట్లు ప్రకటించ లేదు. కనుక రెండవ భాగానికి లీడ్ ఇస్తూ, ఈ సినిమా ముగుస్తుందని భావించవచ్చు.

గతంలో రాజమౌళి - ప్రభాస్ కాంబోలో వచ్చిన 'బాహుబలి' సినిమాని 'ది బిగినింగ్' & 'ది కన్క్లూజన్' అంటూ విభజించిన తర్వాత, అనేక చిత్రాలు అదే ఫార్ములా ఫాలో అయ్యాయి. KGF, పొన్నియన్ సెల్వన్, సలార్‌, పుష్ప చిత్రాలను రెండు భాగాలుగా ప్రకటించారు. ఇటీవల 'దేవర' చిత్రాన్ని కూడా 2 పార్ట్స్ గా అనౌన్స్ చేశారు. అయితే 'కల్కి 2898 AD' మేకర్స్ మాత్రం దీని గురించి ఎలాంటి అనౌన్స్ మెంట్ ఇవ్వలేదు. థియేటర్లలోకి వచ్చిన తర్వాతే ఈ విషయాలపై ప్రేక్షకులకు క్లారిటీ వస్తుంది.

'కల్కి 2898 AD' చిత్రంలో ప్రభాస్ సరసన దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తోంది. దిశా పటానీతో పాటుగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కమల్ ఈ మూవీలో విలన్ అనే టాక్ వుంది. ఇప్పుడు ఆయన మీద ఎక్కువ సీన్స్ షూట్ చేయటం లేదు కాబట్టి, సెకండ్ పార్ట్ లో కమల్ మెయిన్ గా కనిపిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. 2024 మే 9న ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషల్లో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ తో నాగ్ అశ్విన్ మరో కొత్త వరల్డ్ లోకి తీసుకెళ్తానని స్పష్టమైంది. మరి ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.