Begin typing your search above and press return to search.

కల్కి రిలీజ్ డేట్.. మరో కొత్త ట్విస్ట్!

తాజాగా ఈ సినిమా రిలీజ్ కు సంబంధించి మరో వార్త బయటకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్, కౌంటింగ్ తర్వాత ఈ మూవీ విడుదల అవుతుందని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   14 April 2024 1:30 PM GMT
కల్కి రిలీజ్ డేట్.. మరో కొత్త ట్విస్ట్!
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ విషయంలో ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. భారీ బడ్జెట్ తో డిస్టోపియన్ సైన్స్ ఫిక్షన్ జోనర్ లో ఈ సినిమాను యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. పాన్ వరల్డ్ లెవెల్ లో రూపొందుతున్న ఈ సినిమా కోసం అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది ఈ చిత్రం.

వేసవి కానుకగా మే 9వ తేదీన కల్కి సినిమాను రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ ఇప్పటికే ప్రకటించినా.. ఎన్నికల కారణంగా ఆ రోజు రావడం కష్టమే. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్‍ పై సందిగ్ధత నెలకొనగా.. మూవీ టీమ్ ఇప్పటి వరకు స్పందించలేదు. మే 30వ తేదీన ఈ సినిమా విడుదల అవుతుందని కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల జూన్ 20వ తేదీన విడుదల చేస్తారని కూడా టాక్ వచ్చింది.

తాజాగా ఈ సినిమా రిలీజ్ కు సంబంధించి మరో వార్త బయటకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్, కౌంటింగ్ తర్వాత ఈ మూవీ విడుదల అవుతుందని తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక మూవీ విడుదల అవ్వనున్నట్లు సమాచారం. దీని బట్టి చూస్తే.. జూన్ 30వ తేదీ కల్కి మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని అంటున్నారు. ఆ తేదీ కల్లా ప్రభుత్వ ఏర్పాటు పూర్తవుతుంది. కనుక ఆ రోజే విడుదల ఉంటుందని చెబుతున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇక సినిమా విషయానికొస్తే.. విష్ణుమూర్తి పదో అవతారంగా భావించే కల్కి పాత్ర ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నాగ్ అశ్విన్. సుమారు రూ.600 కోట్లకు పైగా బడ్జెట్‍ తో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం మేకర్స్.. ప్రత్యేక ప్రపంచాన్ని క్రియేట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

లవ్ మీ కూడా..?

మరోవైపు, దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ నటిస్తున్న లవ్ మీ సినిమా విడుదల కూడా వాయిదా పడే అవకాశం ఉందని టాక్ వస్తోంది. అరుణ్‌ భీమవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 25వ తేదీన రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించినా.. విడుదల పోస్ట్ పోన్ అవుద్దని అంటున్నారు. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మరి కల్కి, లవ్ మీ చిత్రాల విడుదల తేదీలపై మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూాడాలి.