Begin typing your search above and press return to search.

కల్కి - పవర్ఫుల్ ప్రభాస్ తో అఫీషియల్ రిలీజ్ డేట్ ఆగయా

వైజయంతి మూవీస్ లో రూపొందుతున్న బిగ్గెస్ట్ మూవీ కల్కి 2898 AD పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

By:  Tupaki Desk   |   12 Jan 2024 8:09 AM GMT
కల్కి - పవర్ఫుల్ ప్రభాస్ తో అఫీషియల్ రిలీజ్ డేట్ ఆగయా
X

వైజయంతి మూవీస్ లో రూపొందుతున్న బిగ్గెస్ట్ మూవీ కల్కి 2898 AD పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ నెవ్వర్ బిఫోర్ అనే క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కూడా సినిమాపై అంచనాల స్థాయిని పెంచింది. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది అని ఓ వర్గం ఫ్యాన్స్ అయితే ఎంతో నమ్మకంతో ఉన్నారు.


అయితే ఈ సినిమా విడుదల డేట్ పై ముందుగానే ఇండస్ట్రీలో ఒక బలమైన టాక్ వినిపించింది. ఇక అనుకున్నట్లే సెంటిమెంట్ డేట్ కు రాబోతుంది అని చిత్ర యూనిట్ కూడా అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చింది. వైజయంతి మూవీస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలకమైన పాత్రలో కనిపించనుండగా కమల్ హాసన్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నట్లు ఒక హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే.


అలాగే దీపిక పదుకొనే ప్రభాస్ కి జోడిగా కనిపించబోతోంది. ఇక ఈ సినిమా 2024 మే 9వ తేదీన రాబోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ఒక ఆసక్తికరమైన పోస్టర్ తో క్లారిటీ ఇచ్చింది. పోస్టర్లో ప్రభాస్ చాలా పవర్ఫుల్ గా కనిపిస్తూ ఉన్నాడు. ప్రభాస్ గతంలో ఎప్పుడూ లేనంత యోధుడి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది


ఇక ఇప్పుడు ఈ అప్డేట్ ద్వారా సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి తప్పకుండా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది. ఇక ఈ సినిమాను కేవలం ఇండియన్ లాంగ్వేజెస్ లోనే కాకుండా వివిధ భాషలలో పాన్ వరల్డ్ రేంజ్ లో విడుదల చేయాలి అని వైజయంతి మూవీ ఆలోచిస్తోంది. ఇక సినిమాకు ప్రమోషన్స్ కు తగ్గట్టుగానే రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇచ్చేశారు.

కల్కి సినిమా టైం ట్రావెల్ నేపథ్యంలో ఉండబోతుంది అని కూడా అప్డేట్స్ ద్వారా చిత్ర యూనిట్ చెబుతోంది. నిన్న మొన్నటి వరకు అప్డేట్స్ కూడా అదే తరహాలో హైలెట్ చేస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు మొత్తానికి సినిమా ఫ్యూచర్లోకి తీసుకువెళ్లబోతోంది అని రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.