Begin typing your search above and press return to search.

కల్కి 2898 AD వాయిదాపై కొత్త థియ‌రీ?

అయితే ఫ్యాన్స్ స‌హా ప్ర‌పంచమంతా ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్న ఈ మూవీ రిలీజ్ కి కొన్ని అడ్డంకులు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు

By:  Tupaki Desk   |   25 March 2024 5:48 AM GMT
కల్కి 2898 AD వాయిదాపై కొత్త థియ‌రీ?
X

సలార్ తర్వాత ప్రభాస్ కల్కి 2898 ADతో అభిమానుల ముందుకు రాబోతున్నాడు. చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న ఈ సినిమాని రాజీ అన్న‌దే లేకుండా వైజ‌యంతి మూవీస్ సంస్థ అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ - డిస్టోపియన్ జానర్ లో దేశంలో మునుపెన్న‌డూ చూడ‌ని విజువ‌ల్స్ తో రూపొందుతోంద‌ని ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ వెల్ల‌డించారు. దీంతో ఈ ప్రాజెక్టుపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెలకొంది. క‌థాంశం మ‌హాభార‌త కాలంలో మొద‌లై నేటి జ‌న‌రేష‌న్ కి క‌నెక్టింగ్ గా ఉంటూ భ‌విష్య‌త్ ప్ర‌పంచం ఎలా ఉంటుందో ఆవిష్క‌రించ‌నుంది.

అయితే ఫ్యాన్స్ స‌హా ప్ర‌పంచమంతా ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్న ఈ మూవీ రిలీజ్ కి కొన్ని అడ్డంకులు ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ఏపీ-తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో క‌ల్కి వాయిదా ప‌డుతుందంటూ ఒక సెక్ష‌న్ మీడియా క‌థ‌నాలు వెలువ‌రిస్తోంది. మే 9న విడుదల కావాల్సిన ఈ చిత్రం నాలుగు రోజుల తర్వాత, అంటే మే 13న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఎన్నికలు జరగనున్న సంద‌ర్భంగా ఇబ్బందిని ఫేస్ చేస్తుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. కానీ ఈ సినిమా రిలీజ్ తేదీని వాయిదా వేసేందుకు క‌ల్కి బృందం సిద్ధంగా ఉందా? అంటే ఇప్ప‌టివ‌ర‌కూ దానిపై ఎలాంటి స‌మాచారం లేదు.

ఎల‌క్ష‌న్ కార‌ణంగా ఒక రోజు వ‌సూళ్ల ప‌రంగా త‌గ్గొచ్చేమో కానీ, అది పూర్తిగా డ్యామేజ్ చేయ‌ద‌ని చిత్ర‌బృందం భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది. క‌ల్కి లాంగ్ ర‌న్ లో భారీ వ‌సూళ్ల‌తో మ్యాజిక్ చేస్తుంద‌ని కూడా చిత్ర‌బృందం ధీమాగా ఉంది. అయితే ఒక సెక్ష‌న్ విశ్లేష‌ణ ప్ర‌కారం.. ఎల‌క్ష‌న్ వ‌ల్ల తొలి మూడు రోజుల వ‌సూళ్ల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డుతుంద‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు. అందుకే వైజ‌యంతి బ్యాన‌ర్ రిలీజ్ వాయిదాపై నిర్ణ‌యం తీసుకుంటుందని ఊహిస్తున్నారు. దీంతో బిజినెస్ వ‌ర్గాలు స‌హా అంద‌రిలో ఉత్కంఠ నెల‌కొంది. క‌ల్కిని య‌థాత‌థంగా చెప్పిన టైముకే రిలీజ్ చేస్తారా? లేక వాయిదా వేస్తారా? అన్న‌ది తెలియాలంటే మ‌రికొంత కాలం వేచి చూడాలి.

ఓటీటీ రైట్స్ తో 33శాతం రిట‌ర్నులు:

ప్రస్తుతం భారతీయ సినిమాలోని అతిపెద్ద శక్తులలో ప్రభాస్ ఒకరు. అతడి భారీ ఫ్లాప్ చిత్రాలు కూడా గతంలో భారీ ఓపెనింగుల‌తో పెద్ద మొత్తాన్ని వసూలు చేశాయి. కొన్ని వ‌రుస ఫ్లాపుల త‌ర్వాత కూడా స‌లార్ ఏకంగా 600 కోట్లు పైగా వ‌సూలు చేసి అతిపెద్ద విజ‌యం సాధించింది. ఇంత పెద్ద విజయం తర్వాత, అతడు న‌టించిన `కల్కి 2898 AD`పై అంచ‌నాలు అమాంతం పెరిగాయి.

కల్కి 2898 AD మేకింగ్ లో ఉండగానే, ఈ సినిమా బిజినెస్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ చిత్రం ఏరియా వైజ్ రిలీజ్ హ‌క్కుల‌కు ఇప్పటికే భారీ డిమాండ్ నెల‌కొంది. OTT హక్కులను విక్రయించడానికి మేకర్స్ భారీ మొత్తాన్ని కోట్ చేస్తున్నారని చెబుతున్నారు. అధికారికంగా తెలియనప్పటికీ OTT హక్కుల కోసం మేకర్స్ 200 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు పుకార్ షికార్ చేస్తోంది. అయితే భార‌త‌దేశంలోని అత్యంత క్రేజీ పాన్ ఇండియా స్టార్ సినిమాకి ఓటీటీలు భారీ మొత్తాల‌ను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

కల్కి దాదాపు 600 కోట్ల బడ్జెట్‌తో తెర‌కెక్కుతోంది. ఇది అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా రికార్డుల‌కెక్క‌నుంది. ఓటీటీ రైట్స్ ప‌రంగా విజయవంతంగా డీల్ లాక్ చేస్తే వారు సినిమా మొత్తం బడ్జెట్‌లో 33.33వాతాన్ని రికవరీ చేసిన‌ట్టే. ప్ర‌భాస్ గ‌త చిత్రం సలార్ దక్షిణ భారత భాషల OTT హక్కులను నెట్‌ఫ్లిక్స్‌కు విక్రయించడం ద్వారా 160 కోట్లకు సంపాదించినట్లు సమాచారం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. డిస్నీ+ హాట్‌స్టార్‌తో ఉన్న హిందీ వెర్షన్ హక్కుల ధర ఎంతో ఇంకా తెలియదు.

ఈ భారీ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని, కమల్ హాసన్ లాంటి దిగ్గ‌జ న‌టీన‌టులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హనుమాన్ ఫేమ్ తేజ సజ్జా కూడా తారాగణంలో చేరాడు. ఈ చిత్రం 9 మే 2024న విడుదల కానుంది. పోస్ట్-ప్రొడక్షన్ పనులు పెండింగ్‌లో ఉన్నందున వాయిదా పడినట్లు క‌థ‌నాలొస్తున్నాయి. ఎలక్ష‌న్ వ‌ల్ల కూడా వాయిదా వేస్తార‌ని ప్ర‌చారం సాగుతోంది. కానీ దేనికీ అధికారికంగా క‌న్ఫ‌ర్మేష‌న్ లేదు. మేకర్స్ డెడ్‌లైన్‌ని చేరుకోవడానికి తమ శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.