Begin typing your search above and press return to search.

కల్కి.. ఈ డేట్ ఫిక్స్ అయినట్లే!

మే30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేసేందుకు ఫిక్స్ అయ్యారట.

By:  Tupaki Desk   |   6 April 2024 11:31 AM GMT
కల్కి.. ఈ డేట్ ఫిక్స్ అయినట్లే!
X

అంతా అనుకున్నట్లే జరిగింది. లోక్ సభ ఎన్నికలు సహా పలు కారణాల వల్ల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ అయినట్లే. ఎప్పటి నుంచో వస్తున్న వార్తలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వని మేకర్స్.. తాజాగా కొత్త తేదీని లాక్ చేసినట్లు తెలుస్తోంది. సూపర్ హీరో కాన్సెప్టుతో యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ను అతి త్వరలో ప్రకటించనున్నారు.

ఈ సినిమాలో భైరవ పాత్రలో ప్రభాస్ కనిపిస్తారని ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ లో రూ.600 కోట్ల బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ పూర్తవ్వగా.. ప్రస్తుతం వీఎఫ్ ఎక్స్ వర్క్స్ జరుగుతున్నాయి.

అయితే ఈ మూవీని వేసవి కానుకగా మే9వ తేదీన విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ లో భాగంగా మే13వ తేదీన తెలుగు రాష్ట్రాలతో పాటు పలు చోట్ల పోలింగ్ జరగనుంది. దీంతో మేకర్స్ రిలీజ్ విషయంలో వెనకాడి.. వాయిదా నిర్ణయం తీసుకున్నారు! మే30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేసేందుకు ఫిక్స్ అయ్యారట.

అప్పటికి ఎన్నికల హడావుడి ముగిసిపోతుంది కాబట్టి మే30వ తేదీ సరైన డేట్ అని ఫ్యాన్స్ అంటున్నారు. త్వరలోనే మూవీ యూనిట్.. స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చి మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించనుందట. విడుదల తేదీపై గత కొద్ది రోజులుగా ట్రేడ్ నిపుణులు, డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు జరిపిన తర్వాత మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విద్యార్థులకు ఇంకా సెలవులు ఉండటంతో మంచి ఓపెనింగ్స్ సాధించడం పక్కా.

ఇటీవల.. నాగ్ అశ్విన్ ఈ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అంచనాలు పెంచేశారు. ఈ చిత్రం మహాభారత కాలంలో మొదలై 2898లో ముగుస్తుందని, అందుకే ఈ సినిమాకు కల్కి 2898 AD అని పేరు పెట్టినట్లు వివరించారు. పూర్తి భారతీయతతో ఒక సరికొత్త ప్రపంచాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో, ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.