Begin typing your search above and press return to search.

కల్కి : ముందస్తు ఏమీ లేదు.. అన్నీ అప్పుడే!

సోషల్‌ మీడియాలో ఈ విషయమై పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారంకు టీం మెంబర్స్ నుంచి అనధికారికంగా ఎలాంటి అప్‌డేట్ లేదు అంటూ క్లారిటీ వచ్చింది.

By:  Tupaki Desk   |   5 March 2024 8:30 AM GMT
కల్కి : ముందస్తు ఏమీ లేదు.. అన్నీ అప్పుడే!
X

ప్రభాస్ హీరోగా దీపికా పదుకునే హీరోయిన్‌ గా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ప్రతిష్టాత్మక సినిమా కల్కి 2898 ఏడీ షూటింగ్ పూర్తి అయ్యిందని, ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్ జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేయనున్నారట.

ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సినిమా నుంచి టీజర్ లేదా ఆసక్తికర గ్లిమ్స్‌ ను మహా శివ రాత్రి సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు నిన్న మొన్నటి వరకు ప్రచారం జరిగింది. సోషల్‌ మీడియాలో ఈ విషయమై పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారంకు టీం మెంబర్స్ నుంచి అనధికారికంగా ఎలాంటి అప్‌డేట్ లేదు అంటూ క్లారిటీ వచ్చింది.

విడుదలకు ఇంకా సమయం ఉంది.. పైగా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ తో టీం మొత్తం చాలా బిజీగా ఉంది. ఇలాంటి సమయంలో మహా శివ రాత్రి స్పెషల్‌ వీడియోను విడుదల చేయడం సాధ్యం కాదని, విడుదలకు నెల ముందు నుంచి అన్ని ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా టీజర్‌, గ్లిమ్స్, ట్రైలర్‌ విడుదల ఉంటుందని వారు చెబుతున్నారు.

ఈ వార్త ప్రభాస్ అభిమానులకు కాస్త నిరుత్సాహం కలిగించింది. కానీ కచ్చితంగా వారందరికి అద్భుతమైన విజువల్‌ వండర్‌ ముందు ఉందని చిత్ర యూనిట్‌ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు. ఆకట్టుకునే కథ మరియు కథనంతో కల్కి సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే.

తెలుగులో చాలా కాలం తర్వాత టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ తో సినిమా రాబోతుంది. ఇది గతంలో వచ్చిన సినిమాలకు పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. ఇది పాన్‌ ఇండియా ప్రేక్షకులను మాత్రమే కాకుండా అంతకు మించి అంటూ మొదటి నుంచి కూడా చిత్ర యూనిట్‌ సభ్యులు పాన్ వరల్డ్‌ మూవీ అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు.

ఈ సినిమాలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌, యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ ఇంకా దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్‌ వంటి ఎంతో మంది సీనియర్ నటీ నటులు కనిపించబోతున్నారు. మే 9న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు.