Begin typing your search above and press return to search.

2898 ఏడీ టీజర్.. ఎలా ఉంటుందంటే..

కల్కి అవతారం నేపథ్యంలో ఈ మూవీ కథాంశం ఉండబోతోందని తెలుస్తోంది. మే నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతున్నారు.

By:  Tupaki Desk   |   24 Feb 2024 5:55 AM GMT
2898 ఏడీ టీజర్.. ఎలా ఉంటుందంటే..
X

డార్లింగ్ ప్రభాస్ లీడ్ రోల్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం కల్కి 2898 ఏడీ. భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో ఈ మూవీని సిల్వర్ స్క్రీన్ పై విజువల్ వండర్ గా ఆవిష్కరించే ప్రయత్నం దర్శకుడు చేస్తున్నాడు. ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో ఈ మూవీ సిద్ధం అవుతోన్న సంగతి తెలిసిందే. అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే, దిశా పటాని లాంటి స్టార్ క్యాస్టింగ్ మూవీలో నటిస్తున్నారు.

కల్కి అవతారం నేపథ్యంలో ఈ మూవీ కథాంశం ఉండబోతోందని తెలుస్తోంది. మే నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతున్నారు. పాన్ వరల్డ్ రేంజ్ లో ఏకంగా 22 భాషలలో కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎగ్జైట్ గా ఎదురుచూస్తున్నారు. కచ్చితంగా ఈ మూవీ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ని అంతర్జాతీయ స్థాయిలో రిప్రజెంట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్ కి సంబందించిన అప్డేట్ ఇవ్వడానికి చిత్ర యూనిట్ సిద్ధం అవుతోంది. మార్చి మూడో వారంలో టీజర్ ఉండొచ్చనే ప్రచారం నడుస్తోంది. ఈ టీజర్ నిడివి 1:23 నిమిషాలు ఉంటుందంట. టీజర్ ని హాలీవుడ్ మూవీస్ రేంజ్ లో డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కచ్చితంగా ఈ టీజర్ తో మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయే ఛాన్స్ ఉంది.

ఇప్పటికే దేశం మొత్తం కల్కి 2898 ఏడీ సినిమాపై దృష్టి పెట్టింది. బాలీవుడ్, సౌత్ స్టార్స్ కలయికలో వస్తోన్న సినిమా కావడంతో అంచనాలు నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి. అలాగే ఇండియన్ మైథాలజీ బేస్ చేసుకొని తెరకెక్కుతోన్న మూవీ కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ హై ఎండ్ లోనే ఉంటాయి. గతంలో వచ్చిన మూవీ టైటిల్ టీజర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది.

డార్లింగ్ ప్రభాస్ ఇమేజ్ కూడా వరల్డ్ వైడ్ గా కల్కి సినిమాతో రీచ్ కావడం గ్యారెంటీ అని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమాని నాగ్ అశ్విన్ ప్రేక్షకుల ముందుకి తీసుకొని రాబోతున్నాడు. మరి ఈ మూవీ ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తుంది అనేది వేచి చూడాలి.