Begin typing your search above and press return to search.

కల్కి.. పాటల సంగతేంటి..

ఇక కల్కి 2898ఏడీ సినిమాలో ఏకంగా నాలుగు పాటలు ఉండేలా నాగ్ అశ్విన్ స్క్రీన్ ప్లే డిజైన్ చేశారంట. అందులో రెండు రొమాంటిక్ సాంగ్స్ గా ఉంటాయని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   17 May 2024 4:40 AM GMT
కల్కి.. పాటల సంగతేంటి..
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్ మూవీ కల్కి 2898ఏడీ. ఇండియన్ ఫస్ట్ ఫ్యూచర్స్టిక్ కాన్సెప్ట్ మూవీగా ఈ చిత్రం సిద్ధమవుతోంది. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా 22 భాషలలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 600 కోట్ల బడ్జెట్ తో వైజయంతి మూవీస్ బ్యానర్ పై స్వప్న దత్, ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ జరుగుతున్నాయి. జూన్ 1 నుంచి మూవీ ప్రమోషన్స్ మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. కల్కి చిత్రాన్ని వీలైనంత అగ్రెసివ్ గా పబ్లిక్ లోకి తీసుకువెళ్లాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక కల్కి 2898ఏడీ సినిమాలో ఏకంగా నాలుగు పాటలు ఉండేలా నాగ్ అశ్విన్ స్క్రీన్ ప్లే డిజైన్ చేశారంట. అందులో రెండు రొమాంటిక్ సాంగ్స్ గా ఉంటాయని తెలుస్తోంది. అలాగే ఒక సాంగ్ మంచి డాన్స్ నెంబర్ గా ఉండబోతుందంట. వీటిలో రిలీజ్ కి ముందు రెండు పాటలను ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఫస్ట్ సింగిల్ గా టక్కర టక్క టక్కర అనే డాన్స్ నెంబర్ సాంగ్ ని రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

ఈ నెలలోనే మొదటి పాట ప్రేక్షకులకి అందించడానికి సిద్ధమవుతున్నారు. నాలుగు సాంగ్స్ తో పాటు ఒక థీమ్ సాంగ్ కూడా మూవీలో ఉండబోతుందట. కచ్చితంగా ఈ పాటలన్నీ నెక్స్ట్ లెవెల్ లో అద్భుతమైన విజువలైజేషన్స్ తో ప్రేక్షకుల్ని అలరిస్తాయని భావిస్తున్నారు. నాగ్ అశ్విన్ సరికొత్త ప్రపంచంలోకి ఆడియన్స్ ని తీసుకువెళ్లడానికి సిద్ధమవుతున్నాడంట.

ఈ మూవీలో ప్రభాస్ కి జోడిగా దిశపటాని, దీపిక పదుకొనే లాంటి స్టార్ హీరోయిన్స్ నటిస్తున్నారు. అలాగే కమల్ హాసన్ మూవీలో ప్రతి నాయకుడుగా కనిపించబోతున్నారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ అశ్వద్ధామ పాత్రలో అలరించడానికి సిద్ధమవుతున్నారు. వీరితోపాటు మరికొంతమంది స్టార్ కాస్టింగ్ కల్కి 2898ఏడీ సినిమాలో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అతి పెద్ద సినిమాగా రాబోతున్న కల్కి 2898ఏడీ తో ప్రభాస్ హాలీవుడ్ మార్కెట్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ మూవీ హాలీవుడ్ లో సక్సెస్ అయితే భవిష్యత్తులో మరిన్ని ఇండియన్ సినిమాలను ఇంగ్లీష్ వెర్షన్ లో స్ట్రైట్ గా థియేటర్స్ లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక ప్రభాస్ సైతం ఈసారి ప్రమోషన్స్ లో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది.