Begin typing your search above and press return to search.

కల్కి 2898 ADలో ప్ర‌భాస్ పార్ట్ పూర్తి

`కల్కి 2898 AD` సైన్స్ ఫిక్ష‌న్, ఫాంట‌సీ నేప‌థ్యంలో భారీ ప్ర‌యోగాత్మ‌క చిత్రం. మ‌హాభార‌త కాలంలో మొద‌లై నేటిత‌రానికి క‌నెక్ట్ అయి ఉంటుంది.

By:  Tupaki Desk   |   17 March 2024 2:40 PM GMT
కల్కి 2898 ADలో ప్ర‌భాస్ పార్ట్ పూర్తి
X

`కల్కి 2898 AD` సైన్స్ ఫిక్ష‌న్, ఫాంట‌సీ నేప‌థ్యంలో భారీ ప్ర‌యోగాత్మ‌క చిత్రం. మ‌హాభార‌త కాలంలో మొద‌లై నేటిత‌రానికి క‌నెక్ట్ అయి ఉంటుంది. భ‌విష్య‌త్ ప్ర‌పంచం ఎలా ఉండ‌బోతోందో తెర‌పై ఆవిష్క‌రిస్తున్నామ‌ని నాగ్ అశ్విన్ చెప్ప‌డంతో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. ఈ ఏడాది మే 9న ఈ పాన్ ఇండియా చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే మొన్నటికి మొన్న ఏపీ ఎన్నికల తేదీని ప్రకటించడంతో పరిస్థితులు మారిపోయాయి. సినిమా వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

మరోవైపు స్పెషల్ సాంగ్ షూటింగ్ కోసం ఇటలీలో ఉన్న ప్రభాస్ ఇప్పుడు మళ్లీ న‌గ‌రానికి చేరుకున్నాడు. తాజా అప్‌డేట్ ప్రకారం.. నాగ్ అశ్విన్ మొదట ప్రభాస్ భాగాలను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారని .. వచ్చే వారం ఒక చిన్న షెడ్యూల్ కోసం ఏర్పాట్లు చేసారని తెలుస్తుంది. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌కి సంబంధించిన ప్యాచ్‌వర్క్ సన్నివేశాలన్నీ పూర్తవుతాయి. వైజంతీ మూవీస్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ చిత్రంలో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది.

ప్రభాస్ తన కెరీర్‌లో మొదటిసారి సూపర్ హీరోగా నటిస్తున్నాడు. అతడి అభిమానులు భారీ రికార్డుల గురించి ఆస‌క్తిగా చ‌ర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్ర‌భాస్- క‌మ‌ల్ హాస‌న్ ల‌ను ఒకే ఫ్రేమ్ లో వీక్షించ‌డం, దీపిక ప‌దుకొనే గ్లామ‌ర్ ట్రీట్ పై భారీ అంచ‌నాలున్నాయి. ఇంకో 50 రోజుల్లోనే క‌ల్కి రిజ‌ల్ట్ గురించి మాట్లాడుతారు. అప్ప‌టివ‌ర‌కూ ప్ర‌చారంలో క‌ల్కి టీమ్ స్పీడ్ కొన‌సాగ‌నుంది.