Begin typing your search above and press return to search.

కల్కి ఆ ఛాన్స్ అస్సలు లేందంతే..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా కూడా మే 9న రిలీజై సెన్సేషనల్ హిట్ అయ్యింది

By:  Tupaki Desk   |   23 Feb 2024 3:57 PM GMT
కల్కి ఆ ఛాన్స్ అస్సలు లేందంతే..!
X

రెబల్ స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా కల్కి. వైజయంతి మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా 500 కోట్ల పైన బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. టైం ట్రావెల్ బ్యాక్ డ్రాప్ తో సూపర్ హీరో సినిమాగా కల్కి రానుంది. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా వస్తుందని నిన్న మొన్నటిదాకా చెబితే రెండు మూడు కాదు ఏకంగా కల్కి 9 భాగాలుగా చేసేలా నాగ్ అశ్విన్ ప్లాన్ ఉందని కొత్త టాక్ మొదలైంది. వీటిలో ఏది నిజం ఏది అవాస్త్వం అన్నది తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.

ఇక కల్కి రిలీజ్ విషయంపై కూడా క్లారిటీ మిస్ అవుతుంది. మే 9న రిలీజ్ అంటూ మేకర్స్ చెబుతున్నా వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని వాయిదా పడుతుందనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఐతే వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు చిత్ర యూనిట్ ఒక సరికొత్త టీజర్ రెడీ చేస్తున్నారట. మార్చ్ 8 శివరాత్రి సందర్భంగా కల్కి నుంచి మరో టీజర్ రాబోతుందట. ఈ టీజర్ లో రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తారని తెలుస్తుంది.

ఒకటిన్నర నిమిషం నిడివితో వస్తున్న ఈ కొత్త టీజర్ సినిమాపై అంచనాలు పెంచడమే కాకుండా రిలీజ్ రూమర్స్ అన్నిటికీ ఒక సమాధానం ఇస్తుందని అంటున్నారు. మార్చ్ ఎండింగ్ కల్ల సినిమా పూర్తి చేసి ఏప్రిల్ లో పూర్తిగా ప్రమోషన్స్ కి సిద్ధం అవుతారట. కల్కి సినిమా మే 9న రిలీజ్ చేయడానికి మరో రీజన్ ఆ రోజు రిలీజైన వైజయంతి సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అందుకున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా కూడా మే 9న రిలీజై సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఆరేళ్ల క్రితం ఇదే బ్యానర్ నుంచి వచ్చిన మహానటి సినిమా కూడా మే 9న రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. సో అదే డేట్ న కల్కి కూడా తప్పకుండా అదరగొట్టేస్తుందని అంటున్నారు. ఆ ఐకానిక్ డేట్ నే కల్కిని వదలాలని చూస్తున్నారు మేకర్స్. మే 9నే కల్కి రిలీజ్ కన్ఫర్మ్ అని ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఈమధ్యనే వచ్చిన వార్తలకు ఆన్సర్ ఇచ్చేలా టీజర్ లో రిలీజ్ డేట్ మరోసారి చెబుతారని తెలుస్తుంది. ప్రభాస్ సరసన దీపిక పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కమల్ హాసన్ నటిస్తున్న కల్కి 2898 ఏడి ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ అందించేందుకు రెడీ అవుతుంది.