Begin typing your search above and press return to search.

కల్కిలో కూడా రొమాంటిక్ టచ్!

పూర్తి ఊహాజనిత కల్పనలతో ఈ సినిమా కంటెంట్ తో పాటు ప్రెజెంటేషన్ ఉండబోతోందని తెలుస్తోంది

By:  Tupaki Desk   |   14 Feb 2024 4:15 AM GMT
కల్కిలో కూడా రొమాంటిక్ టచ్!
X

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ లీడ్ రోల్ లో తెరకెక్కుతోన్న మూవీ కల్కి 2898 ఏడీ. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో రెడీ అవుతోన్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. శ్రీమహావిష్ణువు 10వ అవతారం అయిన కల్కిగా ఈ చిత్రంలో ప్రభాస్ కనిపించబోతున్నాడు.

భవిష్యత్తు ప్రపంచంలో జరిగే కథగా మూవీ ఉండబోతోంది. పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రతినాయకుడిగా కమల్ హాసన్ నటిస్తూ ఉండటం విశేషం. అలాగే అమితాబచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. దీపికాపదుకునే, దిశా పటానీ హీరోయిన్స్ గా చేస్తున్నారు. విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ ఆవిష్కరిస్తున్నారు. దీనికోసం మరో ప్రపంచాన్ని సృష్టించారు.

పూర్తి ఊహాజనిత కల్పనలతో ఈ సినిమా కంటెంట్ తో పాటు ప్రెజెంటేషన్ ఉండబోతోందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి ఇంటరెస్టింగ్ టాక్ బయటకొచ్చింది. ఈ సినిమా ప్రభాస్, దిశాపటాని మీద ఒక రొమాంటిక్ సాంగ్ షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. ఈ సాంగ్ కూడా రెగ్యులర్ ఫార్మాట్ లో కాకుండా కంప్లీట్ అండర్ వాటర్ విజువలైజేషన్ తో సాంగ్ ని చిత్రీకరించాలని ఆలోచిస్తున్నట్లు టాక్.

అదే జరిగితే కచ్చితంగా ఈ సాంగ్ ఒక అద్భుతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండర్ వాటర్ థీమ్ తో సాంగ్ నేచురల్ విజువల్స్ తో రావడం అంటే చాలా సీజీ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫారిన్ లొకేషన్స్ ఈ సాంగ్ ని చిత్రీకరించనున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది. అయితే కథ పరంగా చూసుకుంటే ఇది డిఫరెంట్ టైం లైన్ లో జరగబోతోంది. ఇండియన్ సినిమాటిక్ స్టైల్ లో సాంగ్స్ అవసరమా అనే ప్రశ్న కూడా వస్తోంది.

అయితే సాంగ్స్ ని ఆశ్వసాదించే ఆడియన్స్ చాలా మంది ఉంటారు. సాంగ్ చిత్రీకరణ బట్టి సినిమా సక్సెస్ లో కూడా అది భాగం అవుతుంది. కె రాఘవేంద్రరావు, శంకర్ ఇలా సాంగ్స్ విషయంలో ప్రత్యేక స్థానం క్రియేట్ చేసుకున్నారు. మరి నాగ్ అశ్విన్ వారిని మించిన వండర్ ఏమైన కల్కి చిత్రంలో చూపిస్తాడేమో చూడాలి.