Begin typing your search above and press return to search.

కల్కిలో మరో ఇద్దరు.. ప్లాన్ పెద్దదే.. రికార్డులు బద్ధలే..!

ఇక ఈ సినిమాలో స్పెషల్ రోల్స్ లో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లు కనిపిస్తారని అంటున్నారు

By:  Tupaki Desk   |   29 Jan 2024 8:00 AM GMT
కల్కిలో మరో ఇద్దరు.. ప్లాన్ పెద్దదే.. రికార్డులు బద్ధలే..!
X

మహానటి తర్వత నాగ్ అశ్విన్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. అయితే గ్యాప్ వచ్చినా మరో అద్భుతమైన సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలని ఫిక్స్ అయ్యాడు. అనుకున్నట్టుగానే రెబల్ స్టార్ ప్రభాస్ తో కల్కి అంటూ ఒక క్రేజీ సినిమాతో వస్తున్నాడు. ప్రభాస్ కల్కి 2898 AD సినిమా తో నాగ్ అశ్విన్ చాలా పెద్ద ప్లానే వేశినట్టు తెలుస్తుంది. సినిమా భూత భవిష్యత్ కాలాల నేపథ్యంతో వస్తున్నట్టు తెలుస్తుంది. సినిమా నుంచి వదిలిన ఫస్ట్ గ్లింప్స్ బీభత్సం అనిపించగా త్వరలోనే సినిమా నుంచి టీజర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో స్పెషల్ రోల్స్ లో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లు కనిపిస్తారని అంటున్నారు. అన్ అఫీషియల్ గా వీరి పేర్లు బయట వినిపిస్తున్నా సరే చిత్ర యూనిట్ వీటికి ఖండించలేదు. అలా చూస్తే కల్కి 2898 ADలో వీరు ఉన్నారనే అనుకోవచ్చు. ఇక లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లు మాత్రమే కాదు మరో ఇద్దరు స్టార్స్ కూడా కల్కిలో కనిపిస్తారని అంటున్నారు.

సినిమా క్లైమాక్స్ లో మరో ఇద్దరు స్టార్స్ సర్ ప్రైజ్ ఇస్తారట. సినిమా చివర్లో కృపాచార్య గా న్యాచురల్ స్టార్ నాని సర్ ప్రైజ్ ప్లాన్ చేశారట. ఇక మరోపక్క పరశురాముడిగా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కనిపిస్తారట. తారక్ కనిపించే సీన్స్ అయితే దుమ్ము దులిపేయడం పక్కా అని తెలుస్తుంది. సో ఇదంతా చూస్తే నాగ్ అశ్విన్ భారీ ప్లానింగ్ లోనే ఉన్నాడని చెప్పొచ్చు.

వైజయంతి మూవీస్ బ్యానర్ లో 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న కల్కి సినిమా మే 9 రిలీజ్ ఫిక్స్ చేశారు. అయితే సినిమా అనుకున్న టైం కి రావడం కష్టమని కొందరు అంటుండగా ఎట్టి పరిస్థితుల్లో సినిమాను ఆ డేట్ నే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. నాగ్ అశ్విన్ డైరెక్టోరియల్ గా విజువల్ వండర్ గా కల్కి రాబోతుందని తెలుస్తుంది. మరి ఈ సినిమా ప్రభాస్ ఖాతాలో ఎన్ని రికార్డులను కొత్తగా చేరేలా చేస్తుందో చూడాలి. ప్రభాస్ కల్కి లో చాలా సర్ ప్రైజ్ లు ప్లాన్ చేశాడు నాగ్ అశ్విన్. సినిమా కచ్చితంగా రెబల్ స్టార్ ఫ్యాన్స్ నే కాదు సినీ ప్రియులందరినీ సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు.