Begin typing your search above and press return to search.

షారుక్ మన్నత్ ముందు కల్కి రైడర్లు.. ఫొటో చూశారా?

వైజయంతీ మూవీస్ కు బాగా కలిసొచ్చిన మే 9వ తేదీన కల్కి 2898 ఏడీని రిలీజ్ చేస్తున్నట్లు శుక్రవారమే మేకర్స్ ప్రకటించారు

By:  Tupaki Desk   |   12 Jan 2024 4:27 PM GMT
షారుక్ మన్నత్ ముందు కల్కి రైడర్లు.. ఫొటో చూశారా?
X

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓ వైపు మారుతి ప్రాజెక్ట్ చేస్తూ.. మరోవైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఏడీ సినిమాలో నటిస్తున్నారు. సైన్స్ మైథాలిజికల్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల స్క్రాచ్- 3 పేరుతో విడుదలైన వీడియోతో మూవీపై మరింత హైప్ క్రియేట్ అయింది.

వైజయంతీ మూవీస్ కు బాగా కలిసొచ్చిన మే 9వ తేదీన కల్కి 2898 ఏడీని రిలీజ్ చేస్తున్నట్లు శుక్రవారమే మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ గ్రాఫిక్స్ వర్క్ జెట్ స్పీడ్ లో జరుగుతున్నట్లు తెలిపారు. మరో రెండున్నర నెలల్లో మూవీ ట్రైలర్ తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. పాన్ ఇండియా లెవల్ లో విడుదల కానున్న ఈ సినిమాలో దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు.

ఇక, కల్కి 2898 ఏడీ మేకర్స్.. తమ సినిమా ప్రమోషన్లను వినూత్నంగా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఏకంగా బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ఇంటి ముందు రైడర్లు.. ఆయుధాలతో పాటు కల్కి పోస్టర్ ను పట్టుకుని ప్రమోషన్లు నిర్వహించారు. అటుగా వెళ్తున్న అభిమానులు ఇది చూసి షాక్ అయ్యారు. వెంటనే ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ మూవీ మే 9వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసిన శుక్రవారం (జనవరి 12) రోజే ఈ ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి. షారుక్ ఇల్లు అయిన మన్నత్ ముందు అచ్చు కల్కి సినిమాలోని రైడర్ల పాత్రల్లాగే మాస్కులు ధరించిన ముగ్గురు వ్యక్తులు ఇలా కల్కి మూవీని ప్రమోట్ చేస్తుండటం విశేషం.

అయితే షారుక్, ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీలు డంకీ, సలార్.. ఇటీవలే క్రిస్మస్ సందర్భంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. రెండు సినిమాలు ఒక్కరోజు గ్యాప్ లోనే రిలీజ్ అయ్యాయి. హిందీ మార్కెట్ లో సలార్ కంటే డంకీ స్పష్టమైన ఆధిక్యం సాధించగా.. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు చూస్తే మాత్రం సలార్ పైచేయి కనిపించింది.

ఈ నేపథ్యంలో షారుక్, ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్ కూడా నడిచింది. ఇలాంటి సమయంలో ప్రభాస్ నెక్ట్స్ మూవీ కల్కి 2898 ఏడీ ప్రమోషన్ ను షారుక్ ఇంటి ముందు చేస్తుండటం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఏకంగా రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు నాగ్ అశ్విన్.