Begin typing your search above and press return to search.

కల్కి 2898 AD… ప్రభాస్ న్యూ లుక్ కిర్రాక్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన సలార్ వైబ్ లో ఆడియన్స్, ఫ్యాన్స్ ఉన్నారు

By:  Tupaki Desk   |   29 Dec 2023 4:50 AM GMT
కల్కి 2898 AD… ప్రభాస్ న్యూ లుక్ కిర్రాక్
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన సలార్ వైబ్ లో ఆడియన్స్, ఫ్యాన్స్ ఉన్నారు. సినిమాని సిల్వర్ స్క్రీన్ పై ఆశ్వాదిస్తున్నారు. కలెక్షన్స్ కూడా సాలిడ్ గా వస్తున్నాయి. సలార్ సందడి మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఇప్పుడు ఫ్యాన్స్ ఫోకస్ అంతా కూడా కల్కి మీదకి షిఫ్ట్ అవుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు. అలాగే ఇప్పటి వరకు ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో రానటువంటి కంప్లీట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన టీజర్ నెక్స్ట్ లెవల్ లో ఉండటంతో ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి. హాలీవుడ్ రేంజ్ లో మూవీని నాగ అశ్విన్ విజువలైజ్ చేస్తున్నారు.

షూటింగ్ మెజారిటీ వర్క్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం సీజీ వర్క్ నడుస్తోంది. ప్రతి ఫ్రేమ్ నేచురాలిటీకి దగ్గర ఓ కొత్త ప్రపంచాన్ని చూపించే విధంగా ఉండేలా నాగ్ అశ్విన్ చాలా పకడ్బందీగా సినిమాని సిద్ధం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ప్రభాస్ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఐఐటీ బాంబేలో కల్కి సినిమా గురించి నాగ్ అశ్విన్ స్టూడెంట్స్ కి ఇంటరెస్టింగ్ విషయాలు షేర్ చేశారు.

ఈ ప్రసంగం సందర్భంగా ఐఐటీ ప్రాంగణంలో ప్రభాస్ పోస్టర్ ని ఏర్పాటు చేశారు. ఇందులో కల్కి పోస్టర్ లో ప్రభాస్ కి సూపర్ హీరో లుక్ లో చూపించారు. అయితే ఇది సినిమాలోనిదా లేదంటే స్టూడెంట్స్ క్రియేట్ చేసిందా అనేది క్లారిటీ లేదు. కాని సోషల్ మీడియాలో మాత్రం పోస్టర్ విస్తృతంగా వైరల్ అవుతోంది. డార్లింగ్ ఫ్యాన్స్ ట్విట్టర్ ఎక్స్ లో పోస్టర్ ని షేర్ చేసుకుంటున్నారు.

దీనిని బట్టి కల్కి సినిమాపై డార్లింగ్ ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. అలాగే మైథాలజీ టచ్ తో తెరకెక్కిస్తున్న సినిమా కావడం హిందువుల ఆరాధ్య దైవం అయిన శ్రీమహావిష్ణువు చివరి అవతారం అయిన కల్కి పాత్రలో ఈ సినిమాలో ప్రభాస్ కనిపిస్తూ ఉండటం వలన సినిమాపైన దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉంది. మరి ఆడియన్స్ అంచనాలని నాగ్ అశ్విన్ ఏ విధంగా అందుకుంటాడు అనేది చూడాలి.