Begin typing your search above and press return to search.

ప్రభాస్ vs అమితాబ్ హై వోల్టేజ్ ఫైట్!

తాజాగా అమితాబచ్చన్ బర్త్ డే సందర్భంగా అతని క్యారెక్టర్ లుక్ ని పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ఒక సాధువు రూపంలో అమితాబచ్చన్ శరీరం మొత్తం వస్త్రం కప్పుకొని కనిపిస్తున్నారు

By:  Tupaki Desk   |   12 Oct 2023 4:06 AM GMT
ప్రభాస్ vs అమితాబ్ హై వోల్టేజ్ ఫైట్!
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ కల్కి 2898 ఏడీ. ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. 600 కోట్లకి పైగా ఈ సినిమాపై ఖర్చు చేస్తున్నారు. పాన్ వరల్డ్ మూవీగా సిద్ధమవుతోన్న ఈ చిత్రం ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ గా రెడీ అవుతోంది. ఇండియన్ మైథాలజీలోని పాత్రలని భవిష్యత్తులో కల్కి మూవీ ద్వారా దర్శకుడు చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

శ్రీమహావిష్ణువు అవతారం అయిన కల్కిగా ప్రభాస్ ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. కల్కి యుద్ధ విద్యలు అన్ని కూడా పరశురాముడి దగ్గర నేర్చుకుంటాడని భాగవతంలో రాయబడింది. దీనిని బేస్ చేసుకొని పరశురాముడి పాత్రని కూడా కల్కి చిత్రంలో సృష్టించారు. భూమిపై ఇంకా చిరంజీవులుగా ఉన్నవారిలో పరశురాముడు కూడా ఒకరు. ఆ పాత్రలోనే అమితాబచ్చన్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా అమితాబచ్చన్ బర్త్ డే సందర్భంగా అతని క్యారెక్టర్ లుక్ ని పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ఒక సాధువు రూపంలో అమితాబచ్చన్ శరీరం మొత్తం వస్త్రం కప్పుకొని కనిపిస్తున్నారు. పరశురాముడిని ఎక్కడ ఉన్నారో అన్వేషించే క్రమంలో ఒక గృహలో తపోదీక్షలో ఉన్న అతన్ని కల్కి గుర్తించడం. అక్కడ ఇద్దరి మధ్య భీకరమైన పోరాటం జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది.

టీజర్ లో ప్రభాస్ తనమీదకి వచ్చిన ఒక స్టిక్ ని పట్టుకుంటాడు. అదే స్టిక్ తాజాగా అమితాబచ్చన్ క్యారెక్టర్ చేతిలో ఉంది. దీనిని బట్టి ఇద్దరి మధ్య ఫైట్ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. పాజిటివ్ పాత్రగానే అమితాబచ్చన్ రోల్ ఉంటుందని చెప్పుకుంటున్నారు. కథలో భాగంగా లార్డ్ పరశురామ్ రోల్ ని బిగ్ బి పోషించినట్లు పోస్టర్ బట్టి తెలుస్తోంది.

ఇలా భాగవతం ఆధారంగా చేసుకొని భవిష్యత్తులో కల్కి భగవాన్ నిజంగానే పుడితే అప్పటి ప్రపంచం ఎలా ఉంటుంది. చిరంజీవులుగా ఉన్న వారు కల్కికి ఎలా ఈ ప్రపంచాన్ని డిమన్స్ నుంచి కాపాడటంలో సహకరించారు అనేది కథలో భాగంగా ఉండే అవకాశం ఉంది.