Begin typing your search above and press return to search.

కల్కి 2898AD.. ఇక ఈ గేమ్ ఆగదు!

సినిమాలో దీపిక పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక నెక్స్ట్ ఆమె క్యారెక్టర్ కు సంబంధించిన ఒక ప్రత్యేకమైన టీజర్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   22 April 2024 1:30 PM GMT
కల్కి 2898AD.. ఇక ఈ గేమ్ ఆగదు!
X

పాన్ ఇండియా నెంబర్ వన్ స్టార్ గా దూసుకుపోతున్న ప్రభాస్ నెక్స్ట్ కల్కి సినిమాతో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ సినిమాను యువ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరపైకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఇప్పటికే సినిమాకు సంబంధించిన అన్ని పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. కొంత గ్రాఫిక్స్ పనులు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక రిలీజ్ డేట్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతున్నప్పటికీ మేకర్స్ అయితే ఇప్పటి వరకు సరైన క్లారిటీ ఇవ్వలేదు. కానీ సినిమా మాత్రం మే చివరిలో లేదా జూన్లో రావచ్చు అని అంటున్నారు.

పాన్ వరల్డ్ రేంజ్ కు తగ్గట్టుగా సినిమాను దాదాపు 20 భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇక ప్రమోషన్స్ కూడా గట్టిగా ఉండాలి అని ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. రీసెంట్ గా అమితాబ్ బచ్చన్ అశ్వద్ధామ పాత్రకు సంబంధించిన ఒక టీజర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

ఇక ఆ ఒక్క టీజర్ తో సినిమాకు అటు బాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ అయితే వచ్చింది. ఈ హడావిడి ఏ మాత్రం తగ్గకుండా మేకర్స్ రాబోయే రోజుల్లో మరిన్ని గ్లింప్స్ టీజర్స్ అంటూ సందడి చేయబోతున్నారు. సినిమాలో దీపిక పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక నెక్స్ట్ ఆమె క్యారెక్టర్ కు సంబంధించిన ఒక ప్రత్యేకమైన టీజర్ విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

అలాగే సినిమాలో కమల్ హాసన్ కూడా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. కల్కి రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఫస్ట్ పార్ట్ లో మాత్రం కమల్ హాసన్ క్యారెక్టర్ కొద్దిసేపే ఉంటుంది అని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇక ఆ క్యారెక్టర్ కు సంబంధించిన టీజర్ కూడా ఇప్పటికే సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.

దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ నాని ఇలా మరి కొంతమంది యువ హీరోలు కూడా సినిమాలో భాగమైనట్లుగా ఇదివరకే చాలా రకాలుగా గాసిప్స్ వచ్చాయి. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు మేకర్స్ ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక వీలైనంత వరకు ప్రధాన పాత్రలకు సంబంధించిన టీజర్ లు, పోస్టర్స్ లేదంటే గ్లింప్స్ విడుదల చేయాలి అని దర్శకుడు ఒక ప్లాన్ అయితే సిద్ధం చేసుకుంటున్నాడు. మరి రాబోయే కల్కి అప్డేట్స్ సినిమాపై ఇంకా ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తాయో చూడాలి.