Begin typing your search above and press return to search.

'క‌ల్కీ' ప్ర‌చారం ఇండియాని దాటి వ‌ర‌ల్డ్ షేక్ అయ్యేలా!

ఇండియాలో అన్ని మెట్రోపాలిట‌న్ సిటీస్ లో భారీ ఎత్తున ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు. హైద‌రాబాద్ ..ముంబై..బెంగుళూరు..చెన్నై తో పాటు వివిధ న‌గ‌రాల్లో ప్ర‌చారం ప్లాన్ చేస్తున్నారు

By:  Tupaki Desk   |   29 Feb 2024 2:30 AM GMT
క‌ల్కీ ప్ర‌చారం ఇండియాని దాటి వ‌ర‌ల్డ్ షేక్ అయ్యేలా!
X

'క‌ల్కీ 2898'కి రిలీజ్ కి స‌మ‌యం ఆస‌న్న‌మ‌వుతోంది. భారీ అంచ‌నాల మ‌ధ్య మే లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇంకా రెండు నెల‌లే స‌మ‌యం ఉండ‌టంతో యూనిట్ ప్ర‌చారానికి స‌న్న‌ధం అవు తుంది. 'స‌లార్' హిట్ తో ఫామ్ లోకి వ‌చ్చిన ప్ర‌భాస్ మ‌రోసారి బాక్సాఫీస్ మోతెక్కించ‌డం ఖాయమంటూ ట్రేడ్ సైతం భారీ అంచ‌నాల‌తోనే ఉంది. మ‌రి సినిమాని నాగ్ అశ్విన్ జ‌నాల్లోకి ఎలా తీసుకెళ్లబోతు న్నాడు? రాజమౌళి త‌రహాలో ప్ర‌చార వ్యూహాలు ఏమైనా ఉన్నాయా? అంటే ప్ర‌చారం ఇండియాని దాటి ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌న్నిహిత వ‌ర్గాల నుంచి తెలిసింది.

ఇండియాలో అన్ని మెట్రోపాలిట‌న్ సిటీస్ లో భారీ ఎత్తున ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు. హైద‌రాబాద్ ..ముంబై..బెంగుళూరు..చెన్నై తో పాటు వివిధ న‌గ‌రాల్లో ప్ర‌చారం ప్లాన్ చేస్తున్నారు. అలాగే విదేశాల్లోనూ పెద్ద ఎత్తున ప్రచారం చేయాల‌ని భావిస్తున్నారు. దీనిలో భాగంగా అమెరికా..దుబాయ్ లో ప్ర‌త్యేక ఈవెంట్ నిర్వ‌హించాల‌ని ప్లాన్ చేస్తున్నారుట‌. వీలైనంత వ‌ర‌కూ ఇత‌ర దేశాల్లోకి ఈ ప్యూచ‌ర్ ఇండియా చిత్రాన్ని తీసుకెళ్లాల‌న్న‌ది ప్లాన్ గా క‌నిపిస్తుంది.

క‌ల్కీ ఎలా ఉండ‌బోతుంది? అన్న‌ది ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ రివీల్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇండియా ప్యూచ‌ర్ లో ఎలా ఉండ‌బోతుంది? అన్న‌ది మెయిన్ థీమ్ గా తీసుకుని తెర‌కెక్కిస్తున్నారు. భార‌తదేశం యోక్క‌ మొత్తం చ‌రిత్ర‌ని...పురాణాల్ని సైతం విశ్లేషించి ఈ క‌థ‌ని సిద్దం చేసాడు నాగ్ అశ్విన్. ఇటీవ‌లే ఈ విష‌యాన్ని అధికారికంగానూ రివీల్ చేసాడు. అప్ప‌టి కాలం నుంచి అడ్వాన్స్ టెక్నాల జీని..ప్యూచ‌ర్ సాంకేతిక‌ను ముడి పెట్టి సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించాడు.

కంటెంట్ ప‌రంగా యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ ఉన్న స్టోరీ కావ‌డంతోనే విదేశాల్లో సినిమాని ప్ర‌త్యేకంగా ప్ర‌మోట్ చేసే దిశ‌గా అడుగులేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌భాస్ కి జ‌పాన్ ..చైనా లాంటి దేశాల్లో భారీ ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. వ‌ర‌ల్డ్ వైడ్ రిలీజ్ లో భాగంగా సినిమాని ఆయా దేశాల్లోనూ ప్ర‌మోట్ చేసే అవ‌కాశం ఉంది. అందుకోసం కోట్ల రూపాయ‌లు ప్ర‌చారం కోసం కేటాయించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.