Begin typing your search above and press return to search.

కల్కి 2898 AD .. కొంద‌రి ప్ర‌శ్న‌ల‌కు ధీటైన‌ జ‌వాబు!

కానీ ఇది అనాదిగా ద‌క్షిణాది ప్ర‌జ‌లు ఉత్త‌రాది మీడియా నుంచి చూస్తున్న అహం అన‌డంలో ఎలాంటి సందేహం లేదు

By:  Tupaki Desk   |   19 April 2024 7:30 AM GMT
కల్కి 2898 AD .. కొంద‌రి ప్ర‌శ్న‌ల‌కు ధీటైన‌ జ‌వాబు!
X

2024 మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో 'కల్కి 2898 AD' నిస్సందేహంగా నం.1 స్థానంలో ఉంది. దానికి కార‌ణం భార‌త‌దేశంలోని బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ న‌టిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంలో దీపిక ప‌దుకొనే, అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్ వంటి అద్భుత స్టార్ డ‌మ్ ఉన్న ప్ర‌తిభావంతులు న‌టిస్తున్నారు గ‌నుక క‌చ్ఛితంగా ప్ర‌పంచం దృష్టి ఈ సినిమాపైనే ఉంద‌న‌డంలో సందేహం లేదు. ఈ సినిమా నుంచి విడుద‌లైన లుక్ ల‌పై ఇప్ప‌టికే ర‌క‌ర‌కాల చ‌ర్చ సాగింది. అయితే హిందీ మీడియా నుంచి మాత్రం య‌థావిధిగా మిశ్ర‌మ స్పంద‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. అంతేకాదు.. హిందీ మీడియాలో దీపిక‌, అమితాబ్ వంటి స్టార్ల‌ను మాత్ర‌మే హైలైట్ చేయ‌డం ప్ర‌భాస్ ని త‌గ్గించ‌డం కూడా బ‌య‌ట‌ప‌డింది.

కానీ ఇది అనాదిగా ద‌క్షిణాది ప్ర‌జ‌లు ఉత్త‌రాది మీడియా నుంచి చూస్తున్న అహం అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే రోజుకు 150 కోట్లు వ‌సూలు చేసే స‌త్తా ఉన్న పాన్ ఇండియా స్టార్ గా ప్ర‌భాస్ ఇప్ప‌టికే నిరూపించుకున్నాడు. ఇక క‌ల్కి 2898 ఏడిలో అత‌డి వేష‌ధార‌ణ‌లు ఇప్ప‌టికే పెద్ద కిక్కిచ్చాయి. అభిమానులు ఈ సినిమా రాక‌కోసం వేచి చూసేలా క‌నిపించాయి. మొద‌టి పోస్ట‌ర్ రెండో పోస్ట‌ర్ విష‌యంలో కొన్ని మీడియాలు భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేసినా కానీ, ప్ర‌భాస్ స్టార్ డ‌మ్ ని ఎలివేట్ చేసేలా టీజ‌ర్ ని ఆవిష్క‌రించ‌డంతో అన్ని సంశ‌యాలు తొల‌గిపోయాయి. ప్రాజెక్ట్ కే కోసం నాగ్ అశ్విన్ ఎంపిక చేసుకున్న కాన్సెప్ట్ ఎంతో ఆస‌క్తిని క‌లిగిస్తోంది. భ‌విష్య‌త్ ప్ర‌పంచాన్ని స‌రికొత్త ఊహాలోకాన్ని ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నమిద‌ని నాగ్ అశ్విన్ తొలినుంచి చెబుతున్నారు.

అందువ‌ల్ల ఈ చిత్రం 2024లో బెస్ట్ ఓపెన‌ర్ గా నిలుస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఓవైపు ప్ర‌భాస్ ని త‌గ్గించేందుకు ఒక సెక్ష‌న్ హిందీ మీడియా ఎంత ప్ర‌య‌త్నించినా కానీ, మెజారిటీ హిందీ మీడియాలు వాస్త‌వాన్ని ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నాయి. వాస్త‌వంలో ప్ర‌భాస్ చిత్రం హిందీ మార్కెట్లో భారీ ధ‌ర‌కు అమ్ముడ‌వ్వ‌డం వారికి స‌రైన జ‌వాబు. కల్కి 2898 AD, 600 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న చిత్రం. దేశంలోనే అత్యంత ఖరీదైన సైన్స్ ఫిక్షన్ చిత్రంగా టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం విడుదలకు ముందే భారీ లాభాలను ఆర్జిస్తోంద‌ని ప్ర‌ముఖ హిందీ మీడియాల్లో క‌థ‌నాలొచ్చాయి. ఇప్ప‌టికే అన్ని ఒప్పందాల రూపంలో దాదాపు 150+ కోట్ల ప్రాఫిట్ జోన్‌లో ఉందని కూడా కొన్ని హిందీ మీడియాలే క‌థ‌నాలు ప్ర‌చురించాయి.

ఉత్తర భారతదేశంలో క‌ల్కి థియేట్రికల్ హక్కులను కొనుగోలు చేయడానికి అనిల్ తడాని అతడి సంస్థ 100 కోట్లు వెచ్చించార‌ని.. ఇది సినిమా మొత్తం బడ్జెట్‌లో దాదాపు 16.6 శాతం రిక‌వ‌రీ అని హిందీ మీడియా పింక్ విల్లా ప్ర‌చురించింది.

కల్కి OTT హక్కులు (దక్షిణం)కు భారీ డిమాండ్ నెల‌కొంది. ఈ చిత్రం సౌత్ వెర్షన్ OTT హక్కులు 200 కోట్ల డీల్ ని పూర్తి చేయ‌నుంద‌ని క‌థ‌నాలొచ్క‌చాయి. సలార్ మాదిరిగానే ఈ చిత్రం హిందీలో విభిన్న‌ ప్లాట్‌ఫారమ్ ల‌లో ప్రసారం కానుంది. హిందీలో పాపుల‌ర్ తార‌లు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ నటించిన ఈ చిత్రం హిందీ హక్కుల కోసం ఒక ప్ర‌ముఖ‌ స్ట్రీమింగ్ దిగ్గజం ఇప్పటికే 175 కోట్లను ఆఫర్ చేసిందని హిందీ మీడియా కోయిమొయ్ పేర్కొంది.

కల్కి థియేట్రికల్ రైట్స్ తెలుగు & ఓవర్సీస్

ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం వైజంతీ మూవీస్‌కి కేవలం ఆంధ్రప్రదేశ్ - తెలంగాణా నుండి 200 కోట్లు ఆఫర్ చేసినట్లు క‌థ‌నాలొచ్చాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా తెలుగు హక్కులు 100 కోట్లకు కొనుగోలు చేసార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. పింక్‌విల్లా క‌థ‌నం ప్రకారం... ''కల్కి ఉత్తర భారత పంపిణీ హక్కులను పొందేందుకు అనిల్ తడాని 100 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించారు. ఎప్పటిలాగే అతడు ఈ ఎపిక్ సూపర్ హీరో సాగాని ఉత్తర భారత మార్కెట్‌లలో విస్తృతంగా విడుదల చేయడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తాడు. భారీగా స్క్రీన్‌లను చేజిక్కించుకునేందుకు థియేట‌ర్ల‌ యజమానులతో ఇప్పటికే సంభాషణలను ప్రారంభించాడు'' అని పేర్కొంది.

750 కోట్ల ప్రీ-సేల్స్

దాదాపు 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ప్రభాస్ సినిమా క‌ల్కి విడుదలకు ముందే మొత్తం బడ్జెట్‌ను రికవరీ చేసి 150+ కోట్ల లాభాలను ఆర్జించే అవకాశం ఉందని కూడా విశ్లేష‌కులు చెబుతున్నారు! మే నెలాఖరులోగానీ లేదా జూన్ మధ్యలోగానీ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొన్ని హిందీ మీడియాలు ప్ర‌భాస్ ని త‌గ్గించి రాయొచ్చు. కానీ చాలా హిందీ మీడియాలు ప్ర‌భాస్ సినిమా వాస్తవ మార్కెట్ ని య‌థాత‌థంగా ఆవిష్క‌రిస్తూ ఇత‌రులు అభిప్రాయాల‌ను ప‌ట్టించుకోవ‌ద్ద‌ని చెప్ప‌క‌నే చెబుతున్నాయి. నిస్సందేహంగా భార‌త‌దేశంలో ప్ర‌భాస్ సిస‌లైన పాన్ ఇండియా స్టార్ అని నిర్ధారిస్తున్నాయి.