Begin typing your search above and press return to search.

కల్కి.. ఇంకా అక్కడ బేరాలు కుదర్లే

డార్లింగ్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ కల్కి 2898 ఏడీ. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని అశ్వినీ దత్ నిర్మిస్తోన్నారు

By:  Tupaki Desk   |   20 March 2024 4:53 AM GMT
కల్కి.. ఇంకా అక్కడ బేరాలు కుదర్లే
X

డార్లింగ్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ కల్కి 2898 ఏడీ. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని అశ్వినీ దత్ నిర్మిస్తోన్నారు. రెండు భాగాలుగా ఇండియన్ మైథాలజీ బేస్డ్ గా ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో ఈ చిత్రం సిద్ధం అవుతోంది. నాగ్ అశ్విన్ కల్కి చిత్రంలో కంప్లీట్ న్యూ వరల్డ్ ని చూపించబోతున్నాడు. సినిమాలో క్యారెక్టర్స్ తప్ప లొకేషన్స్ అన్ని కూడా ఫిక్షనల్ ప్రపంచంలో నాగ్ అశ్విన్ సృష్టించినవే కావడం విశేషం.

కమల్ హాసన్ ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తున్నారు. అమితాబచ్చన్ అశ్వద్ధామ పాత్రలో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీపికా పదుకునే, దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మేనెలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే ఆ సమయంలో ఎన్నికలు ఉండటంతో రిలీజ్ వాయిదా పడబోతోంది. నెక్స్ట్ డేట్ ఎప్పుడు అనేది చర్చల దశలో ఉంది.

ఈ మూవీకి సంబందించిన బిజినెస్ డీల్స్ ప్రస్తుతం నడుస్తున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే తెలుగు స్టేట్స్ తో పాటు నార్త్ ఇండియా, ఓవర్సీస్ మార్కెట్ లో బిజినెస్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. కానీ కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో ఇంకా మూవీ డీల్స్ కంప్లీట్ కాలేదంట. ఆ భాషలకి సంబంధించి థియేటర్స్ రైట్స్ కోసం బయ్యర్లు ముందుకి వస్తున్నారు.

కానీ నిర్మాత చెబుతున్న ధరల కారణంగా ఇంకా ఆ రాష్ట్రాలకి సంబందించిన డీల్స్ క్లోజ్ కాలేదని తెలుస్తోంది. అయితే నిర్మాత మాత్రం రైట్స్ విషయంలో తగ్గేదిలే అంటున్నట్లు టాక్. ఇప్పుడు రిలీజ్ డేట్ వాయిదా పడటంతో మరికొద్ది రోజులు ఈ రాష్ట్రాలకి సంబందించిన థీయాట్రికల్ రైట్స్ విషయంలో వేచి చూసే ధోరణిలోనే బయ్యర్లు ఉన్నారు. మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేస్తే సినిమా ఎలా ఉండబోతోందనేది ఒక క్లారిటీ వస్తుంది.

రాబోయే రోజుల్లో మరిన్ని అప్డేట్స్ తో ఇంకాస్త ఎక్కువ బజ్ క్రియేట్ అయితే నిర్మాత చెప్పిన ధర చెల్లించి రైట్స్ తీసుకోవడానికి బయ్యర్లు ముందుకి వచ్చే అవకాశం ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది. ఇక మే లో అనుకున్న డేట్ క్యాన్సిల్ చేసుకొని జులై 5 కు విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. అలాగే ఆగష్టు 15న కల్కి చిత్రాన్ని రిలీజ్ చేసే ఆలోచనతో చిత్ర యూనిట్ ఉంది. కానీ అదే సమయానికి పుష్ప 2 రానుంది. ఆ సినిమా వాయిదా పడితే తప్ప ఆ డేట్ కు సాధ్యం కాకపోవచ్చు. ఇక త్వరలో ఈ డేట్స్ పై స్పష్టత వచ్చే అవకాశం ఉందనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.