Begin typing your search above and press return to search.

కల్కి.. ఆచార్య లాంటి పొరపాటు జరగకుండా..

నాగ్ అశ్విన్ ప్రతి ఫ్రేమ్ ని క్షుణ్ణంగా స్టడీ చేసి అమితాబచ్చన్ ని యంగ్ లుక్ లో నేచురల్ గా చూపించే ప్రయత్నం చేశారని ప్రశంసిస్తున్నారు.

By:  Tupaki Desk   |   22 April 2024 4:22 AM GMT
కల్కి.. ఆచార్య లాంటి పొరపాటు జరగకుండా..
X

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీ కల్కి 2898 ఏడీ. ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. త్వరలో అఫీషియల్ డేట్ ఎనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్, కోలీవుడ్ స్టార్ కమల్ హాసన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే, దిశా పటాని కీలక పాత్రలలో నటిస్తున్నారు. మూవీ సీక్వెన్స్ మెజారిటీగా సీజీలోనే ఉండబోతున్నాయి.

కల్కి ద్వారా నాగ్ అశ్విన్ ఆడియన్స్ ని మరో ప్రపంచంలోకి తీసుకొని వెళ్లబోతున్నాడు. శ్రీమహావిష్ణువు 10వ అవతారం అయిన కల్కి పాత్రలో ప్రభాస్ ఈ మూవీలో కనిపించబోతున్నాడు. భారీ యాక్షన్ సీక్వెన్స్ కి ఢోకా లేదని తెలుస్తోంది. మైథాలజీ ఎడాప్షన్ తో వస్తోన్న మూవీ కావడంతో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారని చిత్ర యూనిట్ బలంగా నమ్ముతోంది.

వరల్డ్ వైడ్ గా 22 భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కల్కి 2898ఏడీ నుంచి అమితాబచ్చన్ క్యారెక్టర్ కి సంబందించిన టీజర్ రిలీజ్ చేశారు. అశ్వద్ధామగా అతని పాత్రని పరిచయం చేశారు. ఈ టీజర్ నిడివి తక్కువగానే ఉన్న నాగ్ అశ్విన్ అమితాబచ్చన్ ని రెండు భిన్నమైన లుక్స్ లో చూపించడం విశేషం. యంగ్ అశ్వద్ధామగా అలాగే మహర్షి గెటప్ లో ఉన్న లుక్స్ ని రివీల్ చేశారు.

అమితాబచ్చన్ యంగ్ లుక్ కోసం డీఏజింగ్ టెక్నాలజీని ఈ చిత్రంలో ఉపయోగించినట్లు తెలుస్తోంది. డీఏజింగ్ టెక్నాలజీ ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయ్యింది. ఈ చిత్రంలో యంగ్ అమితాబచ్చన్ లుక్ డీఏజింగ్ తరువాత చాలా పెర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నాగ్ అశ్విన్ ప్రతి ఫ్రేమ్ ని క్షుణ్ణంగా స్టడీ చేసి అమితాబచ్చన్ ని యంగ్ లుక్ లో నేచురల్ గా చూపించే ప్రయత్నం చేశారని ప్రశంసిస్తున్నారు.

ఈ డీఏజింగ్ టెక్నాలజీని ఆచార్య సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఉపయోగించారు. అందులో యంగ్ లుక్ లో చిరంజీవిని కొరటాల చూపించారు. అయితే ఆ యంగ్ లుక్ మెగా ఫ్యాన్స్ కి కూడా నచ్చలేదు. ఆ ఎఫెక్ట్ బాక్సాఫీస్ పైన కూడా చూపించింది. అలాగే టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో కూడా రవితేజ యంగ్ లుక్ కోసం డీఏజింగ్ టెక్నాలజీ వాడిన పెద్దగా ఎట్రాక్ట్ చేయలేదు. వీటిని విపరీతంగా ట్రోల్ చేశారు.

ప్రస్తుతం GOAT సినిమాలో విజయ్ ని యంగ్ గా చూపించడం కోసం ఈ టెక్నాలజీని వాడుతున్నారంట. అందులో విజయ్ ఎలా ఉంటాడో చూడాలి. అయితే అమితాబచ్చన్ అశ్వద్ధామ యంగ్ లుక్ ని నాగ్ అశ్విన్ అద్భుతంగా చూపించాడని మాట ఇప్పుడు సోషల్ మీడియాలోవ్ వినిపిస్తోంది. ముఖ్యంగా నార్త్ లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అక్కడ క్లిక్ అయితేనే సినిమాకు కలెక్షన్లు బాగుంటాయి. మరి రాబోయే అప్డేట్స్ ఎలా ఉంటాయో చూడాలి.