బాలీవుడ్ పై కల్కి కొచ్లిన్ సంచలన కామెంట్స్
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ మాజీ భార్య కల్కి కొచ్లిన్ ఎప్పుడూ ఏదొక విధంగా వార్తల్లో నిలుస్తుందనే విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 16 May 2025 11:03 AM ISTప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ మాజీ భార్య కల్కి కొచ్లిన్ ఎప్పుడూ ఏదొక విధంగా వార్తల్లో నిలుస్తుందనే విషయం తెలిసిందే. అనురాగ్ కశ్యప్ నుంచి విడిపోయాక కూడా బాలీవుడ్ లో కెరీర్ ను కొనసాగిస్తున్న కల్కి.. యే జవానీ హై దీవానీ, జిందగీ నా మిలేగీ దోబారా, గల్లీ బాయ్ లాంటి సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఎప్పుడూ ఏదొక కారణంగా వార్తల్లో నిలిచే కల్కి కొచ్లిన్ ఇప్పుడు తాజాగా బాలీవుడ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లోకెక్కింది. బాలీవుడ్ ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటోందని కల్కి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్ట్రాంగ్ కంటెంట్ లేకపోవడాన్ని ఆమె ఈ సందర్భంగా ఎత్తి చూపింది.
అలీనా డిస్సెక్ట్స్ పాడ్‌కాస్ట్ లో కల్కి కొచ్లిన్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఓ ఆర్థిక మాంద్యం జరుగుతున్న విషయం అందరికీ తెలుసా అని ప్రశ్నిస్తూ, అది మరెక్కడో కాదని, బాలీవుడ్ లోనే అని చెప్పిన కల్కి, బాలీవుడ్ ఆర్థిక మాంద్యంలో ఉండటం వల్లే ప్రతీ సినిమాను రీరిలీజ్ చేసి దాంతో నిర్మాతలు లాభాలను తెచ్చుకుంటున్నారని ఆమె పేర్కొంది.
అయితే హిందీ చిత్ర పరిశ్రమలో ఉన్న సంక్షోభం గురించి అందరికీ తెలుసని, తెలిసినప్పటికీ దాన్ని సాల్వ్ చేయడానికి ఎవరూ ప్రయత్నించకుండా ఎవరికి వారే నిస్సహాయంగా భావిస్తూ ఉంటున్నారని కల్కి తెలిపింది. బాలీవుడ్ లో ప్రతీదీ నిలిచిపోయిందని, క్రియేటివ్ టీమ్స్ ను మార్చేసి కొత్తవారిని తీసుకుంటున్నారని చెప్పి బాలీవుడ్ లో తెర వెనుక నిజాలను బయటపెట్టింది. మరి కల్కి కామెంట్స్ పై బాలీవుడ్ పెద్దలెవరైనా స్పందిస్తారేమో చూడాలి.
