భర్తను వేరొకరితో చూడటం చాలా కష్టం.. నటి ఆవేదన!
మాజీ భర్త అనురాగ్ కశ్యప్ నుంచి విడిపోయిన తర్వాత ఆయనను వేరొకరితో చూడటం తనకు నిజంగా బాధ కలిగించిందని కల్కి కోచ్లిన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
By: Tupaki Desk | 24 July 2025 10:36 AM ISTమాజీ భర్త అనురాగ్ కశ్యప్ నుంచి విడిపోయిన తర్వాత ఆయనను వేరొకరితో చూడటం తనకు నిజంగా బాధ కలిగించిందని కల్కి కోచ్లిన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన తల్లిదండ్రుల విడాకులు చూసిన కల్కికి ఇది మరింత కష్టంగా మారిందని కూడా తెలిపారు.
తాజా ఇంటర్వ్యూలో కల్కి మాట్లాడుతూ ఇలా అన్నారు. ''విడాకుల తర్వాత మొదటి కొన్ని సంవత్సరాలు మాకు అంత సులభం కాదు.. ఒకరికొకరు దూరంగా ఉండాల్సిన స్థితి.. ఎందుకంటే మరొకరితో వారిని చూడటం బాధాకరం.. కానీ జ్ఞాపకాలు చాలా బలంగా ఉన్నాయి. ఈ బాధను అధిగమించడానికి ఇద్దరికీ చాలా సంవత్సరాలు పట్టింది'' అని కల్కి వెల్లడించారు. కానీ కాలక్రమేణా ఇద్దరూ తిరిగి కలుసుకుని గౌరవప్రదమైన సంబంధాన్ని కొనసాగించే స్థితికి చేరుకున్నామని తెలిపారు.
తన తల్లిదండ్రుల కష్టమైన విడాకులను చూసానని చెప్పిన కల్కి కొచ్లిన్ అనురాగ్‌తో తన బ్రేకప్ ని జీర్ణించుకోవడం మరింత కష్టతరంగా మారిందని చెప్పింది. కష్టకాలంలో ఉన్నప్పటికీ ఇటీవల అనురాగ్ కుమార్తె వివాహ వేడుకలకు కల్కి హాజరైంది. వారు తమ గత బాధను అధిగమించగలిగారు. కల్కి కొచ్లిన్ ఇంతకుముందు రణ్ వీర్ సింగ్ గల్లీబోయ్స్ లో నటించిన సంగతి తెలిసిందే. అనురాగ్ ని పెళ్లాడక ముందు పలు విజయవంతమైన చిత్రాల్లో కల్కి నటించారు. అనురాగ్ ప్రస్తుతం ఉత్తరాది పరిశ్రమను వదిలి, దక్షిణాదికి వలస వచ్చారు. పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
