Begin typing your search above and press return to search.

మాజీ భ‌ర్త కుమార్తె అంటే ఎంత‌టి ప్రేమ‌?

అనురాగ్ తో 6 సంవ‌త్స‌రాల బంధం ఉంది. ఈ బంధంలో 500 -600 మంది ప‌రిచ‌యం. వారితో రిలేష‌న్స్ క‌ట్ చేసుకోలేన‌ని కూడా క‌ల్కి కొచ్లిన్ అన్నారు.

By:  Tupaki Desk   |   15 May 2025 11:14 PM IST
మాజీ భ‌ర్త కుమార్తె అంటే ఎంత‌టి ప్రేమ‌?
X

ప్ర‌ఖ్యాత ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ మాజీ భార్య క‌ల్కి కొచ్లిన్ బాలీవుడ్ లో కెరీర్ ని సాగిస్తున్న సంగతి తెలిసిందే.యే జవానీ హై దీవానీ, జిందగీ నా మిలేగీ దోబారా వంటి సినిమాల్లో తన పాత్రలతో మంచి పేరు తెచ్చుకున్న క‌ల్కి గ‌ల్లీబోయ్ చిత్రంలోను న‌టించింది.

క‌ల్కి పేరు నిరంత‌రం వ్య‌క్తిగ‌త జీవితం కార‌ణంగాను వార్త‌ల్లో నిలిచింది. ఈమె 2011లో చిత్రనిర్మాత అనురాగ్ కశ్యప్‌ను వివాహం చేసుకుంది. కానీ నాలుగేళ్ల వివాహం తర్వాత వారు 2015లో విడిపోయారు. గత సంవత్సరం కల్కి ఆలియా కశ్యప్ వివాహానికి హాజరై తన మాజీ భర్త అనురాగ్ కుమార్తెకు తన మద్దతును అందించింది. అనురాగ్ తో పెళ్ల‌యిన‌ప్పుడు ఆలియా ప‌దేళ్ల చిన్నారి. త‌న‌తో నాకు మంచి అనుబంధం ఉంది. ఒక్క‌సారిగా బంధాన్ని తెంచుకుని వెళ్ల‌లేమ‌ని ఎమోష‌న‌ల్ అయ్యారు క‌ల్కి.

అనురాగ్ తో 6 సంవ‌త్స‌రాల బంధం ఉంది. ఈ బంధంలో 500 -600 మంది ప‌రిచ‌యం. వారితో రిలేష‌న్స్ క‌ట్ చేసుకోలేన‌ని కూడా క‌ల్కి కొచ్లిన్ అన్నారు. ఆలియా- క‌ల్కి మ‌ధ్య మంచి రిలేష‌న్ షిప్ ఉంది. ఆలియా పెళ్లి చేసుకున్న స‌మ‌యంలో క‌ల్కి షేర్ చేసిన ఓ నోట్ ఆస‌క్తిని క‌లిగించింది.

మీ అందరికీ ప్రపంచంలోని ``ఇష్క్, ప్యార్ మొహబ్బత్..`` అంద‌మైన కోట్ ని షేర్ చేసింది. వెయ్యి బాలీవుడ్ చిత్రాల థీమ్ లాగా శుభాకాంక్షలు అని అంది. దీనికి ఆలియా ప్ర‌తిస్పందిస్తూ, నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని రాసింది.