గ్రాఫికల్ వండర్ రిలీజై అప్పుడే ఏడాది!
రిలీజ్‌కు ముందే ప్రచార చిత్రాలతో అంచనాల్ని పెంచేసిన ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సరిగ్గా ఏడాది క్రితం జూన్ 27న విడుదల చేశారు.
By: Tupaki Desk | 27 Jun 2025 2:09 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన గ్రాఫికల్ వండర్ 'కల్కి 2898 AD'. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి.అశ్వనీద్, ఆయన కుమార్తెలు నిర్మించారు. బాలీవుడ్ క్రేజీ లేడీస్ దీపికా పదుకునే, దిషా పటానీ ఇందులో ప్రభాస్‌కు జోడీగా నటించిన విషయం తెలిసిందే. దిషా పటానీ ప్రేమికురాలిగా కనిపించగా, దీపికా పదుకునే దేవుడిరి జన్మనిచ్చే అమ్మగా కనిపించి ఆకట్టుకుంది. భూమిపై విధ్వంసాల అనంతరం మిగిలిన చివరి నగరం కాశీ నేపథ్యంలో మహాభారత కురుక్షేత్రానికి లింక్ పెడుతూ ఈ సినిమా సాగింది.
రిలీజ్‌కు ముందే ప్రచార చిత్రాలతో అంచనాల్ని పెంచేసిన ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సరిగ్గా ఏడాది క్రితం జూన్ 27న విడుదల చేశారు. ఈ సినిమా విడుదలై నేటితో సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర బృందం శుక్రవారం ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. ఏడాది పూర్తయిన సందర్భంగా సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నామని తెలిపింది.
ఒక సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ థియేటర్లని ఆక్రమించి ఏడాది కావస్తోంది. భారతీయ సినిమాల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన విషయం ఇది. ఎపిక్ బ్లాక్ బస్టర్ విడుదలై ఏడాది పూర్తి కావడాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం` అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం మేకర్స్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే వరల్డ్ వైడ్‌గా సంచలనాలు సృష్టించిన ఈ సినిమాలో హేమా హేమీలైన లెజెండరీ యాక్టర్స్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషించారు. అశ్వద్ధామగా అమితాబ్ బచ్చన్, సుప్రీం యాస్కిన్‌గా కమల్ హాసన్ తమ తమ పాత్రల్లో అదరగొట్టారు.
ప్రభాస్ చైల్డ్ క్యారెక్టర్‌కు గార్డియన్‌గా కనిపించే అతిథి పాత్రలో యంగ్ హీరో దుల్కర్ సల్మాన్, మరియమ్మగా శోభన, అతిథి పాత్రల్లో అర్జునుడిగా విజయ్‌దేవరకొండ, రూమీగా రాజేంద్రప్రసాద్, దివ్యగా మృణాల్ ఠాకూర్, ఉత్తరగా మాళవిక నాయర్, చింటూగా రామ్ గోపాల్ వర్మ, బౌంటీ హంటర్‌గా రాజమౌళి, అన్ క్రెడిట్ క్యారెక్టర్లలో మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్, ఫరియా అబ్దుల్లా, దర్శకుడు అనుదీప్ కె.వి, అవసరాల శ్రీనివాస్ కనిపించారు.
రూ.600 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది. తొలి సారి ఏఐ టెక్నాలజీ వాడిన సినిమాగా సంచలనం సృష్టించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో రూ.1200 కోట్లు రాబట్టింది. ఈ మూవీ సాధించిన వరల్డ్ వైడ్ గ్రాస్ వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రా , నైజాం కలిపి రూ.285.80 కోట్లు రాబట్టింది. కర్ణాటక 73.70 కోట్లు, తమిళనాడు రూ.43.35 కోట్లు, కేరళ రూ.31 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.317.40 కోట్లు, ఓవర్సీస్ రూ.281.80 కోట్లు అంటే రూ.30.21 మిలియన్‌లన్నమాట. టోటల్ వరల్డ్ వైడ్‌గా రూ.1003.05 కోట్ల గ్రాస్‌ని సాధించింది. ఇదిలా ఉంటే దీనికి సీక్వెల్ గా రానున్న పార్ట్ 2 కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.