'కల్కి-2' సెప్టెంబర్ లో ఆరంభం..2026లో రిలీజ్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో `కల్కి 2` ప్రారంభంపై కొన్ని రోజులుగా సస్పెన్స్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 28 Jun 2025 4:54 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో `కల్కి 2` ప్రారంభంపై కొన్ని రోజులుగా సస్పెన్స్ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. రేస్ నుంచి `స్పిరిట్` ఎగ్జిట్ అవ్వడంతో `కల్కి 2`పై బజ్ నెలకొంది. కానీ మేకర్స్ నుంచి ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో...డార్లింగ్ లైనప్ లో కొత్త డైరెక్టర్ల పేర్లు తెరపైకి రావడంతో ? కల్కి 2 ఇప్పుట్లో మొదలవుతుందా? లేదా? అన్న సందేహాలు కూడా వ్యక్తమ య్యాయి. ఈ నేపథ్యంలో అన్ని సందేహాలకు తెర దించుతూ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వీనిదత్ క్లారిటీ ఇచ్చేసారు.
'కల్కి 2' సెప్టెంబర్ లో ప్రారంభమవుతుందని తెలిపారు. కల్కి గొప్ప విజయం సాధించింది. దీంతో రెండవ భాగంపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం బృందం ప్రీ-ప్రొడక్షన్‌ను పూర్తి చేస్తోంది. సీక్వెల్ ని మరింత ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నాం. ప్రేక్షకుల అంచనాలకు అందకుండా ఉంటుందన్నారు.
అలాగే చిత్రీకరణ సహా అన్ని పనులు పూర్తి చేసి 2026 వేసవిలో రిలీజ్ చేస్తామన్నారు. దీంతో కల్కి 2పై అధికారికంగా విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ప్రభాస్ పౌజీ, రాజాసాబ్ షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు.
'రాజాసాబ్' షూటింగ్ జులై ఆగస్టు కల్లా పూర్తవుతుంది. పౌజీ కూడా ముగింపు దశకు చేరుకునే ఉంటుంది. ఆప్రాజెక్ట్ మొదలైన నాటి నుంచి డార్లింగ్ పౌజీ కోసమే ఎక్కువ డేట్లు కేటాయించి పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే `రాజాసాబ్` ఆలస్యమైంది. కాబట్టి `పౌజీ` కూడా సెప్టెంబర్ కి పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో `కల్కి 2`ని ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా సెప్టెంబర్ నుంచి పట్టాలెక్కించేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నారు.
అయితే దత్ గారు వేసవి రిలీజ్ అన్నారు. కానీ సెప్టెంబర్ లో ప్రారభించి వేసివిలో రిలీజ్ చేయడం అన్నది సాధ్యమవుతుందా? అన్నది సందేహమే. షూటింగ్ పూర్తవ్వడానికే ఏడాది సమయం పడుతుంది. అటుపై పోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం పడుతుంది. టెక్నికల్ సినిమా కాబట్టి సీజీ పనులు నెలలు సమయం తీసుకుంటారు. మరి ఈ పనులన్నింటిని వేసవిలోపు పూర్తి చేసి రిలీజ్ చేయడం సాధ్యమవుతుందా? అన్నది చూడాలి.
