'కల్కి' సీక్వెల్ లో దీపిక.. కొత్త అప్డేట్ ఏంటంటే?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే.
By: Tupaki Desk | 12 Jun 2025 1:00 AM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి 2898 ఏడీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ గా గత ఏడాది విడుదలైన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఓ రేంజ్ లో వసూళ్లను రాబట్టింది.
వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ భారీ బడ్జెట్ తో నిర్మించగా, అగ్ర నటులు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా, కమల్ హాసన్ సుప్రీం యాస్కిన్ గా కనిపించి ఆకట్టుకున్నారు. దేవరకొండ, దుల్కర్ సల్మాన్ సహా పలువురు అతిథి పాత్రలతో అలరించారు. బాలీవుడ్ స్టార్ హీరో దీపిక పదుకొణె ఫిమేల్ లీడ్ లో నటించారు.
బౌంటీ ఫైటర్ భైరవగా అలరించిన ప్రభాస్.. చివర్లో కర్ణుడిగా కనిపించి పార్ట్-2పై భారీ అంచనాలు క్రియేట్ చేశారు. దీంతో సీక్వెల్ కోసం ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు. అయితే సీక్వెల్ కు సంబంధించి 30 శాతం షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపోవడం విశేషం. పార్ట్-1 చిత్రీకరణ జరుగుతున్న సమయంలో దాన్ని పూర్తి చేశారు మేకర్స్.
ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే స్టార్ట్ చేయనున్నారు. అయితే సీక్వెల్ లో కూడా దీపికా పదుకొణె నటిస్తున్నట్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. కానీ కొద్ది రోజులుగా మాత్రం కల్కి-2 నుంచి తప్పించారని సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. భారీ డిమాండ్ల వల్ల ఆమెను మేకర్స్ తప్పించినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి.
కానీ ఇప్పుడు ఆ వార్తలు రూమర్లేనని తెలుస్తోంది. దీపికను కల్కి మేకర్స్ తొలగించలేదని సమాచారం. కల్కి -2లో దీపిక కీలక పాత్ర పోషిస్తుందని సన్నిహిత వర్గాలు తెలిపాయి. సీక్వెల్ లో కూడా ఆమె తన యాక్టింగ్ తో ఆకట్టుకోనుందట. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టినట్లు అయ్యింది.
2026లో కల్కి సీక్వెల్ రిలీజ్ అవ్వనుందని టాక్. రెండో పార్ట్ లో కమల్ హాసన్ రోల్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. ప్రభాస్ , కమల్ హాసన్ ల మధ్య సన్నివేశాలు ఉంటాయని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. దీపికా పదుకొణె రోల్ కు కూడా ప్రాధాన్యం ఉంటుందని స్టోరీ బట్టి తెలుస్తోంది. మరి మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో.. ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.
