Begin typing your search above and press return to search.

ట్రైలర్: 'కలియుగం పట్టణంలో' ఏం జరిగింది?

యంగ్ హీరో విశ్వ కార్తికేయ, ఆయూషీ పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం కలియుగం పట్టణంలో.

By:  Tupaki Desk   |   19 March 2024 10:36 AM GMT
ట్రైలర్: కలియుగం పట్టణంలో ఏం జరిగింది?
X

యంగ్ హీరో విశ్వ కార్తికేయ, ఆయూషీ పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం కలియుగం పట్టణంలో. డిఫరెంట్ కాన్సెప్ట్ తో రమాకాంత్‌ రెడ్డి తెరకెక్కిస్తుండగా.. ఈ చిత్రాన్ని డా.కందుల చంద్ర ఓబుల్ రెడ్డి నిర్మిస్తున్నారు. నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ బ్యానర్స్ పై రూపొందుతున్న ఈ సినిమాకు జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేశ్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వేసవి కానుకగా కలియుగం పట్టణంలో సినిమా మార్చి 29న రిలీజ్ కానుంది.


ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్ రిలీజ్ అవ్వగా.. తాజాగా మేకర్స్ ట్రైలర్‌ ను విడుదల చేశారు. 'వీడు ఉండాల్సింది ఇక్కడ కాదు మెంటల్ హాస్పటిల్ లో' అంటూ వస్తున్న డైలాగ్ తో ట్రైలర్ ఎమోషనల్ గా స్టార్ట్ అయింది. ఆ తర్వాత హీరోను రివీల్ చేశారు మేకర్స్. అయితే ఓ అబ్బాయిని చిన్నప్పుడే పిచ్చోడు అని మెంటల్ ఆస్పత్రికి పంపిస్తే పెద్దయ్యాక ఎలా మారాడన్నది ఆద్యంతం ఆసక్తిగా సాగిన ట్రైలర్ లో చూపించారు మేకర్స్.

అనంతరం నల్లమల అడవుల్లో ఏదో జరుగుతుందంటూ పోలీసుల ఆపరేషన్ చేస్తున్న సీన్స్ ను చూపించారు. వీటితో పాటు సినిమాలో లవ్ స్టోరీ కూడా ఉంది. ట్రైలర్ చూస్తుంటే సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ కలియుగం పట్టణంలో సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. ఇక ట్రైలర్ చివరలో ఏ యుగంలో అయినా తల్లిని చంపే రాక్షసుడు ఇంకా పుట్టలేదమ్మా అని హీరో చెప్పగా.. ఇది కలియుగం అని కౌంటర్ ఇవ్వడం ఇంట్రెస్టింగ్ గా ఉంది.

మొత్తానికి మూవీపై మంచి బజ్ క్రియేట్ చేయడం కోసం ట్రైలర్ ను అదిరిపోయే రీతిలో కట్ చేశారు మేకర్స్. సినిమాలో ఆధ్యాత్మిక అంశాలతోపాటు ఐటెం సాంగ్ ఉన్నట్లు చూపించారు. విశ్వ కార్తికేయ తన నటనతో అదరగొట్టారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. చరణ్ మాధవనేని సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అజయ్ అరసాడ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.

ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఇలా అనేక బాధ్యతలను రమాకాంత్‌ రెడ్డి చేపట్టారు. ఈ సినిమాలో చిత్ర శుక్లా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. కడపలోని కేఎస్ఆర్ ఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌ లో థియేట్రికల్ ట్రైలర్ ను మంగళవారం ఆవిష్కరించారు మేకర్స్. ఈ వేడుకకు పలువురు అతిథులు కూడా వచ్చారు. మరో 10 రోజుల్లో విడుదల కానున్న ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.