Begin typing your search above and press return to search.

ఇంత‌కీ ఆ హీరోయిన్ బ‌రువెంత హీరోగారు!

బాలీవుడ్ సూప‌ర్ జోడీ షారుక్ ఖాన్ కాజోల్ కాంబినేష‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు

By:  Tupaki Desk   |   4 Aug 2023 6:14 AM GMT
ఇంత‌కీ ఆ హీరోయిన్ బ‌రువెంత హీరోగారు!
X

బాలీవుడ్ సూప‌ర్ జోడీ షారుక్ ఖాన్-కాజోల్ కాంబినేష‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. 'దిల్‌‌‌‌వాలే దుల్హనియా లేజాయేంగే'..' కుచ్‌‌‌‌ కుచ్ హోతా హై'.. 'కభీ ఖుషీ కభీ ఘమ్' లాంటి సూపర్‌‌‌‌‌‌‌‌ హిట్ సినిమాల్లో నటించి బెస్ట్ పెయిర్‌‌‌‌‌‌‌‌గా నిలిచారు. ఆ సినిమాల్లో ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ర్టీ వ‌ర్కౌట్ అయిన విధానం ఆద్యంతం ఆక‌ట్టుకుంటుంది. ఆ చిత్రాలు ఎప్ప‌టికీ వండ‌రే అనే చెప్పాలి. అందుకే దశాబ్ధాల త‌ర్వాత 'దిల్ వాలే' తో మ‌రోసారి ఆ స‌క్సెస్ పుల్ కాంబినేష‌న్ చేతులు క‌లిపింది.

భారీ అంచ‌నాల మ‌ద్య రిలీజ్ అయిన 'దిల్ వాలే' మాత్రం అంచ‌నాలు అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. ఆనాటి 'దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే' ఫీల్ ని తీసుకు రాలేక‌పోయింది. తాజాగా ఈ సినిమా గురించి ఆనాటి ముచ్చ‌ట్లు గుర్తు చేసుకుని కాజోల్ న‌వ్వేసుకుంది. 'ఈ సినిమా పోస్ట‌ర్ కోసం ఫోటో షూట్ చేసాం. అందులో షారుక్ త‌న భుజాలపై న‌న్ను ఎత్తుకుని ఉంటారు. ఆ స‌న్నివేశం త‌ర్వాత షారుక్ ఒక్క‌సారిగా భుజం నొప్పితో బాధ‌ప‌డ్డారు.

ఆ విష‌యం అప్ప‌ట్లో న‌న్ను చాలా ఆందోళ‌న‌కి గురి చేసింది. ఓవైపు పెయిన్ అనుభువిస్తూనే న‌న్ను మోసారు. అంతే కాదు తిరిగి నాకే ధైర్యం చెప్పారు. నువ్వు భ‌య‌ప‌డ‌కు. నీకు ఏం కాదు. నాకు ఏం కాలేద‌ని ధైర్యం చెప్పారు. అలాంటి ప‌రిస్థితుల్లో కూడా ఎంతో నిదానంగా..తేలిక‌గా ..నాకు ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఆ చిత్రీక‌ర‌ణ ముగించారు. అయితే షారుక్ మాత్రం నా బ‌రువు ఎంతో అడ‌గ‌లేదు' అని న‌వ్వేసింది.

మ‌రి కాజోల్ ఎంత బ‌రువుంది అన్న‌ది మోసిన షారుక్ ఖాన్ ఖానే కే తెలియాలి. ఈ విష‌యాన్ని షారుక్ ఎక్క‌డా ఇంత‌వ‌ర‌కూ చెప్ప‌లేదు. అప్ప‌టి మీడియాలో భుజం నొప్పి అని మాత్రమే బ‌య‌ట‌కు వ‌చ్చింది. అందుకు ర‌క‌ర‌కాల కార‌ణాలు తెర‌పైకి వ‌చ్చాయి. కానీ కాజోల్ ని మోయ‌డం వ‌ల్ల భుజం ప‌ట్టేసింద‌న్న సంగ‌తి ఇంత వ‌ర‌కూ ఎవ‌రికీ తెలియ‌దు.