రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే భయానక ప్రదేశం: బాలీవుడ్ స్టార్ హీరోయిన్!
అయితే బాలీవుడ్ నటి కాజోల్.. ఓ ఇంటర్వ్యూలో రామోజీ ఫిల్మ్ సిటీపై చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
By: Tupaki Desk | 18 Jun 2025 11:30 AM ISTహైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ దాదాపు అందరికీ సుపరిచితమే. ఫేమస్ పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన ఫిల్మ్ సిటీకు రోజూ లక్షల మంది టారిస్టులు తరలివెళ్తుంటారు. అదే సమయంలో అక్కడ డైలీ అనేక సినిమాల షూటింగ్స్ జరుగుతుంటాయి. ఫిల్మ్ సిటీలోనే వివిధ స్పాట్స్ లో ఎప్పటికప్పుడు చిత్రీకరణలు జరుగుతూనే ఉంటాయి.
టాలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్ సహా అన్ని ఇండస్ట్రీల సినిమాలు కూడా షూటింగ్ జరుపుకుంటాయి. దీంతో కెరీర్ లో దాదాపు అందరు నటీనటులు అక్కడికి వెళ్లే ఉంటారు. అయితే బాలీవుడ్ నటి కాజోల్.. ఓ ఇంటర్వ్యూలో రామోజీ ఫిల్మ్ సిటీపై చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
తాను నటించిన ఓ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరగ్గా.. తాను నెగిటివ్ వైబ్స్ ఎదుర్కొన్నానని కాజోల్ వ్యాఖ్యానించారు. కొన్ని ప్రదేశాలు భయానకంగా ఉన్నాయని ఆరోపించారు. అక్కడి నుంచి వెంటనే బయటకు వెళ్లిపోవాలని అనుకున్నానని, మళ్లీ మరోసారి రామోజీ ఫిల్మ్ సిటీ వెళ్లాలనుకోలేదని ఆమె అన్నారు.
అంతే కాదు.. రామోజీ ఫిల్మ్ సిటీని ప్రపంచంలోనే అత్యంత భయానక ప్రదేశాలలో ఒకటిగా వర్ణిస్తూ ఆరోపణలు చేశారు. దీంతో ఆమె కామెంట్స్ వైరల్ గా మారగా.. అనేక మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. వ్యక్తిగతంగా భయపడి అలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని ఇప్పుడు కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
అసౌకర్యంగా అనిపించేంత మాత్రాన.. భయానక ప్రదేశం కాబోదని ఇంకొందరు చెబుతున్నారు. సినీ ఇండస్ట్రీలోనే అత్యంత ఫేమస్ అయిన షూటింగ్ స్పాట్ గా ఫిల్మ్ సిటీని వర్ణిస్తున్నారు. సౌత్ కే కాదు.. దేశానికి ఫిల్మ్ సిటీ గర్వకారణమని అంటున్నారు. మొత్తానికి కాజోల్ వ్యాఖ్యలు.. ఇప్పుడు నెట్టింట భారీ చర్చకు దారితీశాయి.
కాగా, కాజోల్ విషయానికొస్తే.. బాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా సత్తా చాటారు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. బాద్ షా షారుఖ్ ఖాన్ సరసన అత్యధిక సినిమాల్లో నటించిన హీరోయిన్ గా నిలిచారు. అయితే పెళ్లి తర్వాత చాలా కాలం పాటు సినిమాలకు దూరమైన అమ్మడు.. రీసెంట్ గా రీ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు పలు సినిమాలు, వెబ్ సిరీసుల్లో యాక్ట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రామోజీ ఫిల్మ్ సిటీపై కామెంట్స్ చేశారు.
