50 ఏళ్ల వయసులో ఆ హీరోతో లవ్!
ఆ నాటి మ్యాజిక్ ను రిపీట్ చేసి నెటి జనరేషన్ ల్లోనే క్రీజీగా మారాలని కాజల్ ఆసక్తిగా ఉంది.
By: Tupaki Desk | 14 Jun 2025 11:44 AM ISTషారుక్ ఖాన్-కాజోల్ జోడీ గురించి చెప్పాల్సిన పనిలేదు. 'దిల్ వాలే దుల్హానియే లే జాయేంగే', 'కుచ్ కుచ్ హో హై' లాంటి క్లాసిక్ చిత్రాలతో వెండి తె రపై తమదైన ముద్ర వేసారు. ఇద్దరి కెరీలో ఆ రెండు చిత్రాలు మైల్ స్టోన్స్. ఆ రెండు విజయాలు షారుక్..కాజల్ ని బాలీవుడ్ అందనంత ఎత్తులో కూర్చోబెట్టాయి. దిల్ వాలే దుల్లానియేలా జాయేంగ్, కుచ్ కుచ్ చిత్రాల్లో కాజల్-షారుక్ రొమాంటిక్ లవ్ స్టోరీ ఎంత గొప్పగా పడిందో తెలిసిందే.
అప్పటి నుంచి షారుక్-కాజల్ కాంబినేషన్ అంటే అంచనాలు హైలో ఏర్పడుతుంటాయి. ఆ తర్వాత మళ్లీ చాలా కాలానికి అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని షారుక్ -కాజల్ కలిసి దిల్ వాలేలో నటించారు. కానీ అది పెద్దగా ఆడలేదు. ఆ కాంబినేషన్ లో సినిమా అనగానే ఒకటే హైప్ క్రియేట్ అయింది. కానీ రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ వద్ద తేలిపోయారు. అయితే కాజల్ మాత్రం మళ్లీ 90 రోజుల్లోకి వెళ్లి షారుక్ ఖాన్ తో రొమాంటిక్
సినిమాలు చేయడానికి రెడీగా ఉంది.
ఆ నాటి మ్యాజిక్ ను రిపీట్ చేసి నెటి జనరేషన్ ల్లోనే క్రీజీగా మారాలని కాజల్ ఆసక్తిగా ఉంది. ఈ విషయాన్ని తానే స్వయంగా రివీల్ చేసింది. `దిల్ వాలే దుల్హానియా, కుచ్ కుచ్ చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షకుల మనసులో పదిలంగానే ఉన్నాయి. ఎవర్ గ్రీన్ జోడీలో సినిమా వస్తుందంటే ప్రేక్షకులు ఇప్పటికీ అంతే ఆదరణ చూపిస్తారు. నాకు కూడా షారుక్ తో మరోసారి నటించాలని ఉంది. ఆయనతో కలిసి నేటి కాలాన్ని , భావోద్వేగాలను ప్రతిబింబించే ఓ ప్రేమ కథలో నటించాలని ఉంది` అన్నారు.
దీంతో ఇప్పుడీ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. కాజల్ వయసు ఇప్పుడు 50 ఏళ్లు. షారుక్ ఖాన్ వయసు 60 ఏళ్లు. ఆ ఇద్దరు ఇప్పుడు అందమైన లవ్ స్టోరీలో నటిస్తే? ఎలా ఉంటుందో? ప్రేమకు వయసు తో సంబంధం లేదని భావించడంలో తప్పులేదు. కానీ వయసు దాటిన తర్వాత లవ్ స్టోరీలు చేస్తే చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
